సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Garividi Lakshmi: నాలుగు జిల్లాలకే పరిమితమైన నా కథ.. ప్రపంచమంతా తెలిసింది..

ABN, Publish Date - Oct 18 , 2026 | 10:06 AM

‘గరివిడి లక్ష్మి’ సినిమాతో నా కథ ప్రపంచమంతా కనిపిస్తోంది అని ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి వ్యాఖ్యానించారు.

"ఓ మూడు నాలుగు జిల్లాల్లోనే ప్రదర్శనలు ఇచ్చా. బుర్రకథలో నా పేరుండొచ్చు గానీ, నా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.  ఇప్పుడు ‘గరివిడి లక్ష్మి’ సినిమాతో నా కథ ప్రపంచమంతా కనిపిస్తోంది అని ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి వ్యాఖ్యానించారు. ఆమె కథ ఆధారంగా  తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ పాత్ర పోషించారు. రాగ్ మయూర్, నరేష్ కీలక పాత్రధారులు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ సినిమాపై జనాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ "నా బుర్రకథలను ఎంతో మంది చేశారు. నా పాటలు పాడి కొందరు బతికారు. కానీ, నా పేరు తెచ్చుకోవాలంటే కష్టమైన పని. అది అంత సులభంగా జరగదు.  నా కథ కోసం డైరెక్టర్ గౌరీ నాయుడు చాలా తిరిగాడు. తను పడిన శ్రమ చూసి నా కథ చెప్పాను. ఈ రోజు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. బుర్రకథలో నాకు పేరు ఉంది. కానీ ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. నిర్మాత కృతి చిన్న పాప. తనకు నా కథను ఎందుకు తీసుకోవాలనిపించిందో తెలియదు. నా కథను సినిమాగా చేసినందుకు, సినిమా చూసిన అందరికీ ధన్యవాదాలు. డైరెక్టర్ గౌరీ నాయుడుకు కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.  ఈ సినిమా చూసిన వాళ్లందరూ   ఆనంది నాలాగే చేసిందని  చెప్తుంటే నా పేరు నిలబెట్టిందని ఆనందంగా అనిపించింది' అని అన్నారు. 


నిర్మాత కృతి ప్రసాద్ మాట్లాడుతూ" సినిమాపై ప్రేక్షకులు ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు.  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలామంది ‘ఈ స్టోరీని నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఇందులో ఏం స్పెషాలిటీ కనిపించింది?’ అని అడిగారు. నా తొలి సినిమా నిర్మించినప్పుడు కచ్చితంగా కొత్త కంటెంట్ ఉన్న సినిమా చేయాలనుకున్నాను. నిజానికి గరివిడి లక్ష్మి కథ విన్నప్పుడు బుర్రకథ అంటే ఏంటో,  ఈ జనరేషన్‌కు ఆ కళారూపం గురించి తెలుసా అనే ఐడియా కూడా నాకు పెద్దగా లేదు. కాకపోతే, ఆ లెగసీని, కల్చర్‌ను ఈ జనరేషన్‌కు చూపించాలనుకున్నాను. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ రాసిన గౌరీ గారికి ధన్యవాదాలు. చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. తప్పకుండా ఆయనకు చాలా గొప్ప కెరీర్ ఉంటుంది. చరణ్ సంగీతం, సపోర్ట్‌ ఈ సినిమాకు ఒక పిల్లర్. సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. ఆనందికి హ్యాట్సాఫ్. తన 100 శాతం ప్యాషన్‌తో వర్క్ చేసింది. ఈ పాత్రలో తను మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అన్నారు. 

 
హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ "ఇది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. రెండేళ్లుగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నాను. విశ్వప్రసాద్ గారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన ప్రౌడ్ ఫాదర్. కృతి ప్రసాద్ గారు గెలిచారు. అందరం ఒక మంచి ఉద్దేశం కోసం పనిచేశాం. ఈ సినిమాను అందరూ సెలబ్రేట్ చేసుకోవడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నా ఎమోషన్స్ అన్నింటికీ ప్రాణం పోశారు. సెలబ్రేషన్స్ వీడియోలు, ఫోన్ కాల్స్ చూస్తున్నప్పుడు మేము పడిన కష్టమంతా మర్చిపోయాం" అన్నారు. 

దర్శకుడు గౌరీ నాయుడు మాట్లాడుతూ "
ఈ సక్సెస్ చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఉంది. ప్రేక్షకులకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్ గారు గరివిడి లక్ష్మి గారికే కాదు, నాకు, మా టీమ్ అందరికీ ఒక గుర్తింపు ఇచ్చారు. నాలాంటి టెక్నీషియన్లు బతికారు అంటే దానికి కృతి ప్రసాద్ గారి దయే కారణం.  గొప్ప మనసు ఉంది కాబట్టే ఈ కథను సెలెక్ట్ చేశారు. గరివిడి లక్ష్మి మా అందరికీ గుర్తింపును ఇచ్చారు. ఆవిడ కథ ఎంత గొప్పదో ఈ ప్రపంచమే చెబుతోంది. ఆనంది గారి పెర్ఫార్మెన్స్ గురించి ఆడియన్స్ గొప్పగా మాట్లాడుకుంటుంటే నిజంగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. కష్టమొస్తే ఎలా నిలబడాలి, పడిపోయిన తర్వాత ఎలా గెలవాలి అనేది ఈ సినిమా మీకు చెబుతుంది" అన్నారు. 

ALSO READ:
Anandhi: అవకాశాల కోసం ఎవరినీ అడగను.. ఆనంది మనసులో మాట

Bombay Stories: 'బాంబే స్టోరీస్' ఓటీటీ మూవీ.. విశ్లేష‌ణ‌

shiraz mehdi: చిన్న సినిమాలను.. చంపేస్తున్నారు

Updated Date - Oct 18 , 2026 | 11:01 AM