సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బ్రేకింగ్ న్యూస్: ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్

ABN, Publish Date - Jul 22 , 2026 | 05:16 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘గబ్బర్ సింగ్’ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విలన్ కమ్ హాస్య నటుడు రమేష్ (గబ్బర్ సింగ్ రమేష్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Brain Stroke to Gabbar Singh Ramesh

టాలీవుడ్‌లో తీవ్ర ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విలన్ కమ్ హాస్య నటుడు రమేష్ (గబ్బర్ సింగ్ రమేష్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆకస్మికంగా ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి.. ఆయనను ఆసుపత్రికి తరలించారు.


అపోలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స

బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రమేష్‌ (Gabbar Singh Ramesh)ను హైదరాబాద్‌లో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసియు (ICU)లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మిక్కిలి విషమంగా ఉందని అపోలో వైద్య బృందం వెల్లడించినట్లుగా తెలుస్తోంది. న్యూరాలజీ విభాగానికి చెందిన నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది.


‘గబ్బర్ సింగ్’ చిత్రంలోని తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్న రమేష్ ఉన్నపళంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనే వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, నటులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. రమేష్ త్వరలోనే ఈ గండం నుంచి బయటపడి, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత రమేష్ అండ్ టీమ్‌కు మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా సినిమాల్లో టీమ్‌కు అవకాశాలు వచ్చాయి. రీసెంట్‌గా వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ రమేష్ కనిపించారు.

ఇవి కూడా చదవండి:

‘AA23’ హీరోయిన్ ఫిక్స్? వద్దు బాబోయ్ అంటోన్న ఫ్యాన్స్!

ప్రాథమిక పరీక్షల్లో తేలిందిదే.. నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెన్

దర్శకుడు మెహెర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం

Updated Date - Jul 22 , 2026 | 05:16 PM