Fauzi: ప్రభాస్ బర్త్‌డే ట్రీట్.. మూడు నిమిషాల అరాచకం
ABN , Publish Date - Oct 07 , 2026 | 07:59 PM
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి ట్రీట్ రాబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi). టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాలతో పాటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. ఇక ఈ మూవీలో బాలీవుడ్ దిగ్గజాలు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తితో పాటు భానుచందర్, జయప్రద వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు.
అయితే, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు కేవలం పోస్టర్లు మాత్రమే వచ్చాయి కానీ అధికారిక టీజర్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. కానీ, డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ మూవీ నుంచి ఒక అదిరిపోయే మాస్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారట. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ సినిమా టీజర్‌ను లేదా స్పెషల్ గ్లింప్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీన ఈ మూవీ నుంచి దాదాపు మూడు నిమిషాలు ఉన్న టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ టీజర్ కనుక వస్తే మాత్రం అభిమానులకు అది సరికొత్త విజువల్ ఫీస్ట్, భారీ ట్రీట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరోవైపు డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ‘ఫౌజీ’ని కేవలం ఒక సినిమాగా కాకుండా, ఇండియన్ సినిమా గర్వించదగ్గ ఒక అద్భుతమైన విజువల్ వండర్‌గా మలిచేందుకు చిత్ర బృందం రాత్రింబవళ్లు ఎంతో శ్రమిస్తోందట. ప్రస్తుతం జరుగుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ అక్టోబర్ 20వ తేదీ వరకు కొనసాగనుందట. ఆ తర్వాత మరో 10 రోజులు టాకీ పార్ట్‌తో పాటు, ముఖ్యంగా ప్రభాస్‌పై ఒక బ్యూటిఫుల్ మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ జరపనున్నారట. నవంబర్ చివరి నాటికి ‘ఫౌజీ’ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రీ-ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో, ఆజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ అద్భుతమైన చారిత్రాత్మక కథాంశం ప్రేక్షకులకు ఒక అరుదైన అనుభూతిని పంచడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ సినిమా విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అధికారికంగా బయటికి వస్తాయి? థియేటర్లలోకి ఈ విజువల్ వండర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మాత్రం ప్రభాస్ పుట్టినరోజు వరకు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ అప్పుడేనా?.. అయితే ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా
సంయమనం పాటిస్తున్నా.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన
బాలయ్య ‘దాదా’ షూటింగ్ విరామంలో మంచు మనోజ్ ఏం చేశారంటే..