సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తొలి రోజే 'ఈ నగరానికి ఏమైంది?' లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను దాటేసిన 'ఈఎన్ఈ రిపీట్‌'!

ABN, Publish Date - Nov 20 , 2026 | 03:20 PM

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈఎన్ఈ రిపీట్‌' తొలి రోజే రూ.15.27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 'ఈ నగరానికి ఏమైంది?' లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించినా సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.

ENE Repeat Movie

'పెళ్ళిచూపులు' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తరుణ్‌ భాస్కర్ రెండో సినిమా 'ఈ నగరానికి ఏమైంది?' విషయంలో కొంత తడబడ్డాడు. సినిమా కొత్తగా ఉందని యూత్‌ అక్కన చేర్చుకున్నా, కమర్షియల్‌గా మాత్రం అదేమంత ప్రాఫిటబుల్‌ మూవీ అనిపించుకోలేదు. అయితే చిత్రంగా ఆ సినిమా రీ-రిలీజ్‌ అప్పుడు జనాలు విపరీతంగా చూశారు. ఈ స్పందనను ఊహించని తరుణ్ భాస్కర్ సినిమా మొదటిసారి విడుదలైనప్పుడు ఇదే ఆదరణ దక్కి ఉంటే ఎంత బాగుండేదో కదా! అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే... జయాపజయాలతో నిమిత్తం లేకుండా 'ఈ నగరానికేమైంది?'కి గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు. వారందరి నిస్వార్థ సహకారంతోనే తాను అనుకున్న విధంగా 'ఈఎన్ఈ రిపీట్‌'ను తీయగలిగానని తరుణ్‌ భాస్కర్‌ ఇటీవల ప్రీ-రిలీజ్‌ సమయంలో చెప్పారు.


చిత్రం ఏమంటే... గురువారం 'ఈఎన్ఈ రిపీట్‌' మూవీ విడుదలైంది. విదేశాలలో ఈ సినిమాకు జనం జయకేతనం ఎగరేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోనూ కలెక్షన్స్ బాగున్నాయి. ఈ సినిమా ముందు రోజున వేసిన ప్రీమియర్స్ తో కలిపి తొలి రోజున రూ. 15.27 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇది 'ఈ నగరానికేమైంది?' సినిమా లైఫ్‌ టైమ్‌లో కలెక్ట్ అయిన మొత్తాన్ని తొలి రోజునే క్రాస్ చేసినట్టు అయ్యింది. ఎందుకంటే అప్పట్లో 'ఈ నగరానికేమైంది?' మూవీ కేవలం రూ. 12 కోట్ల గ్రాస్ ను మాత్రమే వసూలు చేసింది. అయితే, ఇప్పుడు కూడా 'ఈఎన్ఈ రిపీట్‌'కు పూర్తి స్థాయిలో పాజిటివ్‌ టాక్‌ రాలేదు. 'ఎ క్లాస్‌ సెంటర్స్'లో సినిమాకు తిరుగుండదు కానీ బి, సి సెంటర్స్ లో ప్రేక్షకులను ఇది మెప్పించడం కష్టమే అని అంటున్నారు. 'ఈ నగరానికి ఏమైంది?'కి ఏర్పడిన క్రేజ్‌ కారణంగానే ఇప్పుడీ సీక్వెల్‌కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, సోమవారం వస్తే కానీ దీని పూర్తి స్థాయి సత్తా తెలియదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Rashmika Mandanna: నా భర్త విజయ్ దేవరకొండ ద్వారా.. సత్యసాయి తత్వం తెలిసింది

‘సలార్-2’ కంటే ముందే ‘డ్రాగన్-2’.. నీల్ ప్లాన్ ఇదేనా?

బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఊహించని ట్విస్ట్

Updated Date - Nov 20 , 2026 | 03:24 PM