సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల ‘శ్రీ శ్రీ’ తాజా అప్డేట్ ఇదే

ABN, Publish Date - Aug 02 , 2026 | 11:04 PM

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘శ్రీ శ్రీ’. తాజాగా మేకర్స్ ఈ మూవీ అప్డేట్‌ని తెలియజేశారు.

Sri Sri Update

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి (Ravi Nelakuditi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘శ్రీ శ్రీ’ (Sri Sri). SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ మైల్ స్టోన్ చిత్రం. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే (Pooja Hegde) తొలిసారి జంటగా నటిస్తోన్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా వచ్చిన ‘బొమ్మ బొమ్మ’ సాంగ్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ అప్డేడ్‌ని ఇచ్చారు.


ఈ మూవీ ఫారిన్ షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ షెడ్యూల్‌లో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించామని, ముఖ్యంగా ఈ ఫారిన్ షెడ్యూల్‌లో తెరకెక్కించిన ఎపిసోడ్స్ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలవనున్నాయని వెల్లడించారు. త్వరలోనే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

కీర్తి రెడ్డితో విడాకులకు కారణమిదే: సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

జానీ మాస్టర్ వైఫ్ సుమలత తీరుపై ఫెడరేషన్, నిర్మాతలు తీవ్ర ఆగ్రహం

‘అనకాపల్లి’కి రియల్ హీరో సోనూ సూద్ సపోర్ట్.. ఏం చేశారంటే

మంజు భార్గవి ఆటోబయోగ్రఫీ.. బుక్ టైటిల్ తెలిస్తే షాకే

Updated Date - Aug 02 , 2026 | 11:04 PM