‘అనకాపల్లి’కి రియల్ హీరో సోనూ సూద్ సపోర్ట్.. ఏం చేశారంటే
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:17 PM
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలలో నటిస్తోన్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీ నుంచి డర్టీ గ్యాంగ్‌స్టర్స్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
విక్రమ్ సహిదేవ్ (Vikram Sahidev), సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలలో నటిస్తోన్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ జోరు పెంచారు.
ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ మాసీ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను రియల్ హీరో సోనూ సూద్ (Sonu Sood) చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ‘డర్టీ గ్యాంగ్ స్టర్స్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోని చూస్తుంటే సినిమా ఎంత రా అండ్ రస్టిక్‌గా ఉంటుందో అర్థమవుతోంది. ఇక ఈ పాటను విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు సోనూ సూద్ ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా పాట చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంకా ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
‘డర్టీ గ్యాంగ్ స్టర్స్’ అంటూ సాగే ఈ పాటను కేకే రచించగా.. పృథ్వీ చంద్ర, ఈకే ఆలపించారు. దేవ్‌జాంద్ బాణీ ఎంతో ఇంటెన్స్‌తో ఉంది. ఈ పాట వింటుంటే ఓ అడ్రినల్ రష్‌లా అనిపిస్తోంది. మాస్ ఆడియెన్స్‌కి ఈ పాట ఇన్ స్టంట్‌గా ఎక్కేస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్, లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా చాలా నేచురల్‌గా కనిపిస్తున్నాయి. త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై యూనిట్ అంతా ఎంతో నమ్మకంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
మంజు భార్గవి ఆటోబయోగ్రఫీ.. బుక్ టైటిల్ తెలిస్తే షాకే
అక్క జ్ఞాపకాలను పంచుకుంటూ.. ఆసక్తికర ఫొటో షేర్ చేసిన మెహెర్ రమేష్
‘ఎల్లమ్మ’ నుంచి దేవిశ్రీ ఫ్రంట్ లుక్.. బీజీఎమ్ అదిరింది