జానీ మాస్టర్ వైఫ్ సుమలత తీరుపై ఫెడరేషన్, నిర్మాతలు తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Aug 02 , 2026 | 10:02 PM

ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో ముగిసిందనుకున్న డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం.. మళ్లీ మొదటికొచ్చింది. ఫిలిం ఫెడరేషన్‌తో పాటు, నిర్మాతలు కూడా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలైన సుమలత నిర్ణయంపై సీరియస్ అవుతున్నారు.

Jani Master and Sumalatha

ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో ముగిసిందనుకున్న డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం.. మళ్లీ మొదటికొచ్చింది. ఫిలిం ఫెడరేషన్‌తో పాటు, నిర్మాతలు కూడా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలైన సుమలత నిర్ణయంపై సీరియస్ అవుతున్నారు. రీసెంట్‌గా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, సాయి రాజేష్ సమక్షంలో జరిగిన భేటీ అనంతరం వివాదం ముగిసినట్లుగా స్వయంగా జానీ మాస్టరే ప్రకటించారు. చిరంజీవి, బాలకృష్ణల చొరవతో వివాదం ముగిసిందని, ఎవరి పని వారు చేసుకుంటామని అన్నారు. కానీ, ఇప్పుడు ఎవరిని సంప్రదించకుండా ఉపఎన్నికలను నిర్వహించాలని సుమలత ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు, ఉపఎన్నికలను సస్పెండ్ చేస్తూ లేబర్ కమిషన్ కూడా ఉత్తర్వులు జారీ చేసింది.


రిజైన్ చేసిన సభ్యులను కలుపుకొని పోవాలి లేదా పూర్తిగా ఎన్నికలు నిర్వహించాలని ఫెడరేషన్ అల్టిమేటం జారీ చేయగా, ఉపఎన్నికలను ఆపడానికి రిజైన్ చేసిన కార్యవర్గ సభ్యులు కోర్టుకు వెళ్లకుండా ముందే సుమలత కేవియట్ ఫిటిషన్ వేయడం.. ఫెడరేషన్, నిర్మాతల మాటలను ధిక్కరించినట్లుగా మెంబర్స్ భావిస్తున్నారు. అందుకే సుమలత ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా పరిగణిస్తూ ఫెడరేషన్ సీరియస్‌గా స్పందించింది. సినీ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందాలను పట్టించుకోకుండా.. అధికార దుర్వినియోగంతో సుమలత సొంత నిర్ణయాలను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ ఫెడరేషన్ ఓ లెటర్‌ను విడుదల చేసింది.

సుమలత తీరు మారకపోతే ఫెడరేషన్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి అందులో మెజారిటీ డ్యాన్సర్ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామని ఫెడరేషన్ ప్రకటించింది. సుమలత ఏకపక్ష నిర్ణయాలను వెనక్కి తీసుకుని, ప్రధాన కార్యదర్శి మినహా రిజైన్ చేసిన సభ్యుల రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని ఫెడరేషన్ సూచింది. ఫోక్సో కేసులో నిందితుడుగా ఉన్న జానీ మాస్టర్, అతని భార్య సుమలత ఏకపక్ష నిర్ణయాలు చెల్లవంటూ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని మెజారిటీ మెంబర్స్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.


ఇక ఇదే వివాదంపై.. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కూడా రియాక్ట్ అయ్యారు. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత రిజైన్ చేసిన సభ్యుల స్థానాలకు ఉపఎన్నిక నిర్వహిస్తామనడం తప్పని ఆయన తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్, సుమలత, ఇంకా రిజైన్ చేసిన సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగిందని, అంతటితో సమస్య పరిష్కారం అయ్యిందని ఆయన అన్నారు. అదే విషయాన్ని ఆమె మీడియా ముందు కూడా చెప్పి, ఇప్పుడు ఉపఎన్నికలకు వెళ్లడం తప్పు అని, ఇది కరెక్ట్ కాదని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిపై మరోసారి ఫెడరేషన్‌తో మాట్లాడతామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

‘అనకాపల్లి’కి రియల్ హీరో సోనూ సూద్ సపోర్ట్.. ఏం చేశారంటే

మంజు భార్గవి ఆటోబయోగ్రఫీ.. బుక్ టైటిల్ తెలిస్తే షాకే

అక్క జ్ఞాపకాలను పంచుకుంటూ.. ఆసక్తికర ఫొటో షేర్ చేసిన మెహెర్ రమేష్

Updated Date - Aug 02 , 2026 | 10:02 PM