సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్‌పై అనుమానాలు.. అసలు విషయం ఏంటంటే

ABN, Publish Date - Sep 16 , 2026 | 10:09 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ‘డ్రాగన్’ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ మూవీ రిలీజ్ విషయంలో ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Dragon Movie Update

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) - ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ‘డ్రాగన్’ (Dragon) చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జూన్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ డేట్ ప్రకటించిన కొన్నాళ్ళకే ఎన్టీఆర్ గాయం కారణంగా ఓ రెండు నెలలు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. అంటే దాదాపు అరవై రోజులు ఎన్టీఆర్ పోర్షన్ తీయడానికి ఆటంకం ఏర్పడింది. ఈ కోణంలో ఆలోచిస్తే ‘డ్రాగన్’ అనుకున్న సమయానికి రాకపోవచ్చునని వినిపిస్తోంది. ఎందుకంటే రెండు నెలల గ్యాప్‌తో షూటింగ్ ఆరంభమైనా.. ఎంత వేగంగా చిత్రీకరణ జరుపుకున్నా.. జూన్ 11న ‘డ్రాగన్’ రిలీజ్ (Dragon Release Update) కాదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీజనం.


ముందుగా ప్రకటించినట్టుగా ‘డ్రాగన్’ చిత్రాన్ని 2027 జూన్ 11న రిలీజ్ చేయాలంటే ఎంత లేదన్నా రాబోయే ఫిబ్రవరికి మొత్తం షూటింగ్ పూర్తి కావాలి. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్స్, వీఎఫ్ఎక్స్ తదితరమైన వర్క్ కోసం మూడు నెలలయినా పడుతుంది. అంటే, మే నెలాఖరుకు ఫస్ట్ కాపీ సిద్ధం కావాలి. అప్పుడే సెన్సార్ పూర్తి చేసి అనుకున్నట్టుగా జూన్ 11వ తేదీకి ‘డ్రాగన్’ను రిలీజ్ చేయవచ్చు. అయితే ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఇతర నటీనటులు నటించాల్సిన సీన్స్ చిత్రీకరణకే అసలు సమయం పడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ కాంబోలో ‘డ్రాగన్’లోని మెయిన్ కాస్ట్ నటించాల్సి ఉంది. వారందరి డేట్స్ మళ్ళీ పట్టుకొని తాజా షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అది సవ్యంగా జరిగితే పర్లేదు.. లేదంటే జూన్ 11వ తేదీని మరచిపోవాల్సిందే అంటున్నారు పరిశీలకులు.


తమ ‘డ్రాగన్’ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ చెబుతున్నారు. ప్రస్తుతానికి జూన్ 11వ తేదీనే ‘డ్రాగన్’ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ యేడాది అక్టోబర్‌లో దసరా సందర్భంగా ‘డ్రాగన్’ టీజర్ రిలీజవుతుందని వినిపిస్తోంది. అందులో ‘డ్రాగన్’ అసలైన రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారనీ అంటున్నారు. ఇలా ‘డ్రాగన్’ చుట్టూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నిటికీ గాయం కారణమని చెప్పవచ్చు.. కానీ, ఎన్టీఆర్‌కు పనిరాక్షసుడు అనే పేరుంది. ఒక్కసారి కమిట్ అయితే చాలు రేయింబవళ్ళు పనిచేసి తన సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేసిన సందర్భాలున్నాయి. నిజంగా అదే జరిగితే మాత్రం జూన్ 11వ తేదీనే ‘డ్రాగన్’ రిలీజ్ అవుతుందని భావించవచ్చు. ఏమవుతుందో చూడాలి?

ఇవి కూడా చదవండి!

సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం

కేంద్ర సెన్సార్ బోర్డులో కీలక మార్పు.. సుప్రియ యార్లగడ్డకు చోటు

‘లేతమనసులు’ చిత్రానికి 60 ఏళ్లు.. విశేషాలివే

Updated Date - Sep 16 , 2026 | 10:09 PM