సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజమౌళి బ్రాండ్‌కు అక్కడ ట్రబుల్!

ABN, Publish Date - Oct 02 , 2026 | 05:27 PM

దర్శకధీరుడు రాజమౌళి పేరు వినిపించగానే సినీ ఫ్యాన్స్‌లో ఓ ఆసక్తి మొదలవుతుంది.. అంతలా ఆయన తన సినిమాలతో జనాన్ని ఆకర్షిస్తున్నారు. అయితే రాజమౌళి బ్రాండ్ ఒక విషయంలో మాత్రం పని చేయటం లేదంటున్నారు. అదేంటో చూద్దాం.

SS Rajamouli and Dont Trouble the Trouble Movie

దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కేవలం దర్శకునిగానే కాకుండా ఇతర శాఖల్లోనూ పనిచేశారు. ఇక కొన్ని చిత్రాలకు ఆయన పేరును సమర్పకునిగానూ వినియోగించుకున్నారు. ఇప్పుడు రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ (Don't Trouble the Trouble) చిత్రానికి కూడా రాజమౌళి ప్రెజెంటర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కూడా భాగస్వాములు కావడం విశేషం. అందువల్ల సినీ ఫ్యాన్స్‌లో ఈ చిత్రంపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. రాజమౌళి కొడుకు కార్తికేయ తొలిసారి నిర్మాతగా మారి నిర్మించిన చిత్రమిది. ఈ కారణంగానే రాజమౌళి ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ మూవీ ప్రమోషన్స్‌లోనూ విశేషంగా పాల్గొన్నారు. అయితే ఆయన బ్రాండ్ సినిమాకు అంతగా ఉపయోగపడినట్లు లేదని ప్రీమియర్స్ ద్వారా వినవచ్చిన టాక్. మరి ఆయన సినిమాల లాగే ఈ సినిమా కూడా మెల మెల్లగా సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందనీ కొందరంటున్నారు.


గతంలో అల్లరి నరేశ్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ చిత్రానికి కూడా రాజమౌళి పేరు సమర్పకునిగా ఉంది. ఆ సినిమా పరాజయం పొందింది. హను రాఘవపూడి దర్శకునిగా పరిచయమవుతూ రూపొందిన ‘అందాల రాక్షసి’ సినిమాకు కూడా రాజమౌళి సహనిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రంతో డైరెక్టర్‌గా హను రాఘవపూడికి మంచి పేరు వచ్చింది.. కానీ, కమర్షియల్‌గా ఆ సినిమా కూడా అంతగా అలరించలేదు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన స్వరాజ్య పోరాట చిత్రం ‘రాజన్న’కు రాజమౌళి ఫైట్స్ రూపొందించారు. ఈ మూవీ సైతం మురిపించలేకపోయింది. రణబీర్ కపూర్, నాగార్జున నటించిన ‘బ్రహ్మాస్త్ర’ హిందీ సినిమా సౌత్ వర్షన్స్‌కు రాజమౌళి పేరును ప్రెజెంటర్‌గా వేశారు. భారీ వ్యయంతో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ వసూళ్ళు బాగానే ఉన్నా, పెట్టుబడికి తగ్గ రాబడి చూడలేదు. ఇలా రాజమౌళి పేరు వల్ల సదరు చిత్రాల విడుదలకు ముందు క్రేజ్ లభించిందే తప్ప అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోవడం గమనార్హం. దాంతో ఇప్పుడు అందరి దృష్టి కార్తికేయ నిర్మాతగా అందించిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’పై పడింది.


గతంలో రాజమౌళి పేరును ఉపయోగించుకున్న చిత్రాలకు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు కొంత తేడా ఉంది. ఈ చిత్రానికి రాజమౌళి పేరుతో పాటు తెలుగులో నటసింహ బాలకృష్ణ వాయిస్ ఓవర్, తమిళంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ వ్యాఖ్యానం, మళయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ పలుకులు ఎస్సెట్‌గా నిలిచాయి. ఇక ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ యన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తాను సమస్యల్లో ఉన్నప్పుడు కార్తికేయ అండగా నిలిచారని యన్టీఆర్ ఆ వేదికపై చెప్పడం కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక మహేశ్ బాబు ఈ సినిమా చూసి థ్రిల్లయినట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు. మహేశ్ కూతురు సితార సైతం ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో కూడా ఆకట్టుకుంటోంది. ఈ అంశాలన్నీ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు కలిసి వస్తాయని యూనిట్ భావిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, చిన్నారి సారా నటన ఆకట్టుకుంటోందని చూసినవారు చెబుతున్నారు. మరి ఈ సారి రాజమౌళి పేరు ప్రెజెంటర్‌గా ఏ మేరకు కలసి వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘ఆరుగురు పతివ్రతలు’ మళ్లీ వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ ఫిక్స్

డబ్బులిచ్చి మరి ‘సిగ్మా’పై నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారా? నమ్మవచ్చా!

శ్రీకాంత్ వదిలిన ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ ఫస్ట్ లుక్

Updated Date - Oct 02 , 2026 | 05:27 PM