సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దిల్ రాజు ఆవిష్కరించిన 'అదే నీవు అదే నేను' టీజర్

ABN, Publish Date - Jul 09 , 2026 | 12:55 PM

యువ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన 'అదే నీవు అదే నేను' చిత్రం టీజర్ ను దిల్ రాజు ఆవిష్కరించారు. కొండల్ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ను కాండ్రేగుల గోవిందు నిర్మించారు.

Ade Neevu Ade Nenu teaser launch

'కమిటీ కుర్రోళ్లు' మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, 'సిద్ధార్థ్ రాయ్' సినిమా ఫేమ్ తన్వీ నేగి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా 'అదే నీవు అదే నేను'. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.


ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ కొండల్ మాట్లాడుతూ, 'మా సినిమా కథ గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటి యూత్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం సొసైటీలో భార్యలు భర్తల్ని చంపిన క్రైమ్ న్యూస్ చూస్తున్నాం. అలాంటి తరహాలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. మనం వేసే ఒక తప్పటడుగు, ఆవేశంలో చేసే నేరం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుంది అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం. ప్రేక్షకుల ఊహకు అందకుండా మా సినిమా సాగుతుంది. సెకండాఫ్ లో ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్స్ ఉంటాయి. థియేటర్ లో మా సినిమా చూస్తున్నప్పుడు మీరు ఉలిక్కిపడటం ఖాయం. డీవోపీ జైపాల్ రెడ్డి అందించిన విజువల్స్, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, కనిష్క మ్యూజిక్ మా మూవీలో టెక్నికల్ గా హైలైట్ గా నిలుస్తాయి. దిల్ రాజు గారి చేతుల మీదుగా మా మూవీ టీజర్ లాంచ్ చేసినప్పుడు తన బ్యానర్‌లో చేస్తున్న సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని ఆయన చెప్పడం హ్యాపీగా అనిపించింది. గోవాలో సాంగ్స్ బ్యూటిపుల్ లొకేషన్స్ లో పాటలను చిత్రీకరించాం. దీనిని ఒక పెద్ద సినిమాలాగే నిర్మించారు మా నిర్మాత. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ కోసం ఒరిజినల్ సెట్ వేయించారు. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, సర్ ప్రైజింగ్ కంటెంట్ ఉంటుంది' అని అన్నారు.

ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల మాట్లాడుతూ, 'చాలామంది పేరున్న ప్యాడింగ్ ఆర్టిస్టులు మా మూవీలో కీలక పాత్రల్లో నటించారు. మా మూవీ స్టోరీకి ఏం కావాలో డైరెక్టర్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్లు మూవీకి ఏం కావాలో ప్రొడక్షన్ పరంగా అవన్నీ సమకూర్చాం. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే మా సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు మా మూవీ టీజర్ రిలీజ్ చేసి మాకు బెస్ట్ విశెస్ అందించారు. ఆయనకు టీజర్ నచ్చి మిమ్మల్ని అభినందించడం హ్యాపీగా అనిపించింది' అని అన్నారు. ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, సహర్ కృష్ణన్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి:

డీఎస్పీ భీమ్‌రెడ్డి.. అక్ర‌మాస్తుల కేసులో సినీ హీరో! రూ.3 కోట్ల.. అడ్వాన్స్ తీసుకున్న న‌టుడు

ఎన్టీఆర్‌ ఇచ్చిన ఒక్క అవకాశం.. గుమ్మడి జీవితాన్నే మార్చేసింది!

అక్కినేని ఫ్యామిలీ.. సెవెన్త్ సెంటిమెంట్! అఖిల్ గ‌ట్టెక్కేనా!!

Updated Date - Jul 09 , 2026 | 01:00 PM