ధృవ్ విక్రమ్ హీరోగా రమేశ్ వర్మ సినిమా!
ABN, Publish Date - Sep 12 , 2026 | 08:03 PM
విక్రమ్ తనయుడు ధృవ్ వివాదాలను పక్కన పెట్టి కెరీర్‌పై దృష్టి పెట్టాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో అతను హీరోగా ద్విభాషా చిత్రం అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ నెల 23న ధృవ్ బర్త్ డే సందర్భంగా బిగ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు.
నిన్నమొన్నటి వరకూ వివాదాలతోనే విక్రమ్ తనయుడు ధృవ్ కాలక్షేపం చేశాడు. మరీ ముఖ్యంగా అనుపమా పరమేశ్వరన్‌తో బ్రేకప్ అయిన తర్వాత ఆమె తన మనసులో భావాలను తెలియచేస్తూ, ఇన్ డైరెక్ట్ గా ధృవ్ విక్రమ్‌ను టార్గెట్ చేసింది. అయితే అతను మాత్రం ఒకే స్టేట్మెంట్ ఇచ్చి... ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టాడు. తాజాగా ధృవ్ విక్రమ్ తెలుగువాడైన రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. ఈ సినిమాను పెన్ జయంతిలాల్ సమర్పణలో పెన్ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్‌వి స్టూడియోస్ నిర్మించబోతున్నాయి. హై ఆక్టేన్ యాక్షనర్, ఎమోషన్, డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటనను తాజాగా చేశారు. పూజా కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున నిర్వహించారు.
ఈ సినిమా తొలి షెడ్యూల్ అక్టోబర్‌లో మొదలు కానుంది. ధృవ్ విక్రమ్ బర్త్ డే సెప్టెంబర్ 23న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఆ రోజున ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్, పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లు విడుదల చేయనున్నారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ సాగాని తలపించేలా ఈ సినిమా ఉంటుందని, తొలి షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించ బోతున్నామని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రమేశ్ వర్మ తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను కోనేరు సత్య నారాయణ, శిరీష కూరపాట నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
70 ఏళ్ల వయసొచ్చినా.. నచ్చితే రెండో పెళ్లి చేసుకుంటా: ప్రేమ
‘వారణాసి’ కీలక అప్‌డేట్.. ఇంత స్పీడ్ ఏంటి జక్కన్నా?
TFTDDA: జానీ మాస్టర్ వైఫ్ సుమలత స్కెచ్ అదిరిందిగా.. కోర్టు సంచలన తీర్పు