నాకంటే ఎక్కువ రెమ్యూనరేషనా?.. ప్రభాస్‌ని దీపికా అవమానించిందా
ABN, Publish Date - Aug 28 , 2026 | 09:06 PM
రెబల్ స్టార్ ప్రభాస్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో మూవీ ‘స్పిరిట్’పై మరోసారి దీపికా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రభాస్‌ని అవమానించేలా ఉన్నాయంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమాలో మొదట కథానాయికగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone)ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా తాను ఆ భారీ సినిమా నుంచి ఎందుకు బయటకు వచ్చిందో వివరిస్తూ.. దీపికా పదుకొణె చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో పారితోషికం, ‘జెండర్ పే గ్యాప్’ గురించి దీపికా మాట్లాడుతూ.. ‘‘రీసెంట్‌గా నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నాను. ఆ సినిమాలో అప్పటికే ఒక స్టార్ హీరో ఉన్నారు. ఆయనకు మేకర్స్ ఎంత భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో నాకు తెలుసు. నిజాయితీగా చెప్పాలంటే.. ప్రస్తుతం మార్కెట్‌లో ఆ హీరో కంటే నేనే ఎక్కువ సక్సెస్ రేట్‌తో ఉన్నాను. అందుకే నా మార్కెట్ విలువకు తగ్గట్టు పారితోషికం డిమాండ్ చేశాను. కానీ నిర్మాతలు అంత బడ్జెట్ లేదని చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఆ సినిమా నుంచి వాకౌట్ చేశాను. హీరోయిన్లకు సమాన గుర్తింపు, గౌరవం దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అంటూ కుండబద్దలు కొట్టారు.
దీపికా నేరుగా పేరు ప్రస్తావించకపోయినా, ఆమె వ్యాఖ్యలు ప్రభాస్‌ను ఉద్దేశించినవేనని స్పష్టమవుతుండటంతో డార్లింగ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మార్కెట్ ఉన్న పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో దీపికా తనను పోల్చుకోవడమే కాకుండా, తనకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉందంటూ ఆయనను అవమానించేలా మాట్లాడటం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీపికా క్రేజ్ కేవలం బాలీవుడ్‌కే పరిమితమని, బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రేంజ్, థియేట్రికల్ పుల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ప్రభాస్‌తో సమానమైన స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోయినా అంతటి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘ఇరుముడి’ ఎఫెక్ట్.. రవితేజ హారర్ చిత్రానికి నిర్మాతలు దొరికేశారోచ్!
నిర్మాత ఎస్కేఎన్‌కు రాఖీ కట్టిన హీరోయిన్.. అంతా షాక్
శర్వా ‘భోగి’.. రాఖీ స్పెషల్ పోస్టర్ వైరల్