‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్.. రా, రస్టిక్ అండ్ బోల్డ్‌గా ఆశిష్ గాంధీ రచ్చ
ABN, Publish Date - Sep 18 , 2026 | 09:55 PM
‘నాటకం’, ‘కళింగ’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకున్న సక్సెస్ ఫుల్ కాంబినేషన్ హీరో ఆశిష్ గాంధీ - డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ. ఈ కాంబోలో రాబోతోన్న నూతన చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘నాటకం’, ‘కళింగ’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకున్న సక్సెస్ ఫుల్ కాంబినేషన్ హీరో ఆశిష్ గాంధీ (Ashish Gandhi) - డైరెక్టర్ కళ్యాణ్‌జీ గోగణ (Kalyanji Gogana). తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం ‘డానీ’ (Danny). రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మేకర్స్ ‘డానీ ఫస్ట్ స్ట్రైక్’ (Danny First Strike) పేరుతో అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆద్యంతం యూత్‌ను కట్టిపడేసే బోల్డ్ డైలాగ్స్, రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో సాగింది. బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో హీరోయిన్.. ‘నువ్వు బీచ్‌కి ఎప్పుడూ ఒక్కడివే వస్తావా?’ అని అడగ్గా, ‘నేను బీచ్‌కి రావాలంటే కచ్చితంగా అమ్మాయి ఉండాలి’ అంటూ ఆశిష్ గాంధీ రఫ్ లుక్‌లో సిగరెట్ కాలుస్తూ ఇచ్చే ఆన్సర్ ఆకట్టుకుంది. ఆ వెంటనే ‘ఎందుకు అలా?’ అని ఆమె ప్రశ్నించగా.. ‘నాకు బీచ్ అన్నా, అమ్మాయి బ్యాక్ అన్నా చాలా ఇష్టం’ అంటూ హీరో చెప్పే పచ్చి బోల్డ్ డైలాగ్ కుర్రకారును విపరీతంగా ఆకర్షిస్తోంది. బీచ్ ఒడ్డున అమ్మాయి అందాలు, వారి మధ్య కెమిస్ట్రీ యూత్‌ను టార్గెట్ చేసేలా ఉన్నాయి.
కేవలం బోల్డ్ కంటెంట్ మాత్రమే కాకుండా, ఈ వీడియోలో హీరో రక్తమోడుతున్న తెల్లటి చొక్కాతో.. ఆవేశంలో సిగరెట్ తాగుతూ కూర్చున్న విజువల్స్.. కథలో ఏదో పెద్ద క్రైమ్, వయొలెన్స్ ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. ‘A Whole Lot of Madness’, ‘Danny Says... Welcome to Love Jungle’ వంటి ట్యాగ్‌లైన్స్ సినిమా తీవ్రతను ఎలివేట్ చేస్తున్నాయి. అలాగే చివర్లో బెడ్‌రూమ్ సన్నివేశంలో హీరోయిన్ కాళ్లపై సిగరెట్ పొగ వదులుతూ, ‘మళ్లీ ఎప్పుడు కలుద్దాం?’ అని ఆమె అడిగితే.. ‘మళ్లీ ఎప్పుడైనా మార్నింగ్ జిమ్ చేయాలనిపించినప్పుడు కలుద్దాం’ అంటూ హీరో ఇచ్చే బోల్డ్ రిప్లై వీడియోకు మరింత హైప్ తీసుకొచ్చింది.
ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ సరసన సేజల్ గుప్తా హీరోయిన్‌గా నటిస్తుండగా.. సోనాల్ సింగ్, అజర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫీ, సాయి కార్తీక్ సమకూర్చిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ స్ట్రైక్‌ను నెక్స్ట్ లెవెల్‌లో నిలబెట్టాయి. మణికాంత్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2026లో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ ఫస్ట్ స్ట్రైక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ సినిమాపై ఒక్కసారిగా బజ్‌ను పెంచేసింది.
ఇవి కూడా చదవండి:
‘RC17’ మ్యూజిక్ డైరెక్టర్.. అనిరుధ్ కూడా కాదా!
Sigma Trailer: ‘సిగ్మా’ ట్రైలర్.. విజయ్ కొడుకు హిట్టుకొట్టేలానే ఉన్నాడే!
డూప్ లేకుండా.. శోభిత ధూళిపాళ్ల డెడికేషన్‌కు పా. రంజిత్ ఫిదా