డూప్ లేకుండా.. శోభిత ధూళిపాళ్ల డెడికేషన్‌కు పా. రంజిత్ ఫిదా

ABN , Publish Date - Sep 18 , 2026 | 08:29 PM

‘గూఢచారి’, ‘మేజర్’, ‘మేడ్ ఇన్ హెవెన్’ వంటి ప్రాజెక్ట్‌లతో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల. తాజాగా శోభితపై స్టార్ డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు.

Sobhita Dhulipala Vettuvam Update

‘గూఢచారి’, ‘మేజర్’, ‘మేడ్ ఇన్ హెవెన్’ వంటి ప్రాజెక్ట్‌లతో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala). ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఈ టాలెంటెడ్ బ్యూటీ.. త్వరలోనే తమిళ ఇండస్ట్రీలో రా అండ్ రస్టిక్ అవతార్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా యాక్షన్ డ్రామా ‘వెట్టువం’ (Vettuvam)లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ పేరు ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ వదిలారు. ఇందులో శోభిత అంకితభావాన్ని, నటనను ఆకాశానికెత్తుతూ దర్శకుడు పా. రంజిత్ చేసిన ప్రశంసలు ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి.


శోభిత గురించి పా. రంజిత్ (Director Pa. Ranjith) మాట్లాడుతూ.. ‘‘శోభిత చాలా బ్రిలియంట్ యాక్టర్. నేను ఎప్పటినుంచో ఆమె వర్క్‌ను ఫాలో అవుతున్నాను, ఇద్దరం కలిసి పనిచేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాం. ఎట్టకేలకు ‘వెట్టువం’తో అది కుదిరింది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు ఎంతో ఫిజికల్ ఎనర్జీ అవసరం. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. సినిమాలో ఆమె ఒక్క షాట్‌కు కూడా డూప్‌ను ఉపయోగించలేదు! కేవలం కెమెరా రిహార్సల్స్ కోసం మాత్రమే స్టంట్ డబుల్స్ ఉండేవారు, ఫైనల్ టేక్‌కి వచ్చేసరికి స్వయంగా శోభితే వచ్చి ప్రతి రిస్కీ స్టంట్‌ను పూర్తి చేసింది. తెరపై ఆ సన్నివేశాలు సహజంగా రావాలని ఆమె తన వంద శాతం ఎఫర్ట్స్ పెట్టింది’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అక్కినేని కోడలు అంటే ఆ మాత్రం ఉంటుందిలే అంటూ పా. రంజిత్ ప్రశంసలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.


ఈ చిత్రంలో తన పాత్ర కోసం పడిన శ్రమ గురించి శోభిత స్పందిస్తూ.. ‘‘ఈ సినిమాలో మేము చేసిన కొన్ని యాక్షన్ మూవ్స్, కొరియోగ్రఫీ చేయాలంటే దాదాపు 15 నుంచి 20 ఏళ్ల కఠిన సాధన కావాలి. అంతటి క్లిష్టమైన స్టంట్స్‌ను షూట్ చేసిన ప్రతి రోజూ మా యూనిట్ మొత్తం ఎంతో స్పిరిట్‌తో, టీమ్‌వర్క్‌తో పూర్తి చేశాం’’ అని చెప్పుకొచ్చారు. కెరీర్‌లో ఎప్పుడూ సేఫ్ జోన్‌లో ఉండకుండా, తనను తాను సవాలు చేసుకునే పాత్రలను ఎంచుకునే శోభిత.. ‘వెట్టువం’ కోసం పూర్తిస్థాయి యాక్షన్ ఉమెన్‌గా మారడం ఆమె కెరీర్‌లోనే మైలురాయిగా నిలవనుందని స్పష్టమవుతోంది. ఇదంతా చూస్తుంటే.. పా. రంజిత్ తెరకెక్కించే రా అండ్ ఇంటెన్స్ వరల్డ్‌లో శోభిత విన్యాసాలు వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త గూస్‌బంప్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

ఆస్కార్ రేసులో చరణ్ ‘పెద్ది’కి మిస్సైన ఛాన్స్.. ఫైనల్‌గా ఆ చిత్రం ఎంపిక!

సుహాస్ రంగుపై కామెంట్స్‌తో వివాదం.. ‘మండాడి’ డైరెక్టర్ వివరణ ఇదే!

టైర్ 2 హీరోస్ థియేట్రికల్ బిజినెస్.. ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్!

Updated Date - Sep 18 , 2026 | 08:29 PM