సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఫలక్‌నుమా దాస్’, ‘కల్ట్’ యాక్టర్‌‌కు హీరోగా ఛాన్స్

ABN, Publish Date - Nov 05 , 2026 | 04:53 PM

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటుడు.. ఇప్పుడు ద్విభాషా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Actor Vivek Chepuri

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటుడు వివేక్ చేపూరి (Vivek Chepuri). 2019లో వచ్చిన సెన్సేషనల్ చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’ (Falaknuma Das)లో ‘రవి’ అనే పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో విశ్వక్ సేన్‌ (Vishwak Sen)కు ధీటుగా నటించి సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన వివేక్.. సరిగ్గా ఏడేళ్ల తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ క్రేజీ చిత్రం ‘కల్ట్’ (Cult)లో ‘ఇషాన్’ అనే పాత్రలో తనదైన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా, తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేక మార్క్ క్రియేట్ చేశారు.


ప్రస్తుతం ‘కల్ట్’ చిత్రంలోని ఇషాన్ క్యారెక్టర్‌కు, వివేక్ నటనకు థియేటర్లలో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. సోషల్ మీడియా వేదికగా ఆయన పాత్రకు సంబంధించిన సీన్లు, డైలాగ్స్‌తో నెటిజన్లు రకరకాల రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రేక్షకులు చూపిస్తున్న ఈ అనూహ్యమైన ఆదరణకు వివేక్ చేపూరి సైతం ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సత్తా ఏంటో నిరూపించుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఇప్పుడు ఏకంగా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అవును, వివేక్ చేపూరి హీరోగా పరిచయమవుతూ ఒక సరికొత్త ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టారు.


దర్శకుడు టి. శరత్ చంద్ర దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకోనున్న చిత్రంతో వివేక్ చేపూరి.. హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ హంగులతో మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రతిభావంతుడైన సినిమాటోగ్రాఫర్ ప్రియేష్ గురుస్వామి డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి మొదటి అప్‌డేట్‌గా నవంబర్ నెలలోనే ఒక అదిరిపోయే స్పెషల్ గ్లింప్స్ లేదా టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రా అండ్ ఇంటెన్స్ రోల్స్‌తో మెప్పించిన వివేక్ చేపూరి.. ఈ బైలింగ్వల్ మూవీతో హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ నెలలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ టాలెంట్.. నెట్టింట వైరల్

ఇంతింతై వటుడింతై.. నెల్సన్ గ్రాఫ్ చూశారా

అది ధైర్యం కాదు.. నార్త్ భామలకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్

Updated Date - Nov 05 , 2026 | 04:55 PM