సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishwambhara: ‘విశ్వంభర’ వచ్చేది అప్పుడేనా..

ABN, Publish Date - Oct 05 , 2026 | 07:52 PM

మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), త్రిష జంటగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’(Vishwambhara,) చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడంతో ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఇప్పటికే పలుమార్లు ‘విశ్వంభర’ విడుదలపై వివిధ తేదీలు ప్రచారంలోకి వచ్చినా.. ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది.

ఇటీవల ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి  వస్తుందని టాక్ నడిచింది. చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం ‘కాకా’ 2027 సంక్రాంతి బరిలో నిలువనుంది. ఈ  నేపథ్యంలో.. ‘విశ్వంభర’ను ఆ తర్వాత వచ్చే శివరాత్రి పండుగ సీజన్‌కు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తాజాగా  ప్రచారం జరుగుతోంది. గతంలో నవంబర్ విడుదలపై కూడా వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా శివరాత్రి సీజన్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాను ఫెస్టివల్ సీజన్‌లో విడుదల చేయడం మంచిదని అభిమానులు భావిస్తున్నారు.  

ఇవి కూడా చదవండి:

అలాంటి కొటేషన్స్ వేసి.. ఇలా తగ్గావ్ ఏంటి బండ్లన్నా?

నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది

నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్

Updated Date - Oct 05 , 2026 | 07:58 PM