MSVP: శంకర ప్రసాద్ గారి ఖాతాలో మరో రికార్డు
ABN, Publish Date - Jul 30 , 2026 | 01:54 PM
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాఅరుదైన మైలురాయిని చేరుకుంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'మన శంకరవరప్రసాద్‌గారు' (Mana Shankara varaprasad garu) సినిమా అరుదైన మైలురాయిని చేరుకుంది. విడుదలైన నాటి నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం కడప జిల్లాలోని యర్రగుంట్లలో హేమ పిక్చర్ ప్యాలెస్ లో విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చెబుతూ 'ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్' అనే ట్యాగ్‌తో మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.
విడుదలైనప్పటి నుంచి కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. అనిల్ రావిపూడి తనదైన వినోదాత్మక శైలిలో రూపొందించిన కథ, చిరంజీవి ఎనర్జీ, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. ప్రస్తుత కాలంలో ఓ సినిమా 200 రోజులు పూర్తి చేసుకోవడం అనేది చాలా అరుదు. ఈ ఘనత చిరంజీవికే సాధ్యం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
చిరంజీవి సరసన నయనతార నటించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు కప్.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ALSO READ:
Lenin Movie: నిన్న చైతు, ఇవాళ అఖిల్... మిగిలింది నాగార్జునే!
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ