Lenin Movie: నిన్న చైతు, ఇవాళ అఖిల్... మిగిలింది నాగార్జునే!

ABN , Publish Date - Jul 30 , 2026 | 02:30 PM

అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ఇక సోలో హీరోగా నాగార్జున ఈ మైలు రాయిని దాటడమే మిగిలి ఉంది.

Lenin Movie

అఖిల్ అక్కినేని 'లెనిన్' చిత్రం మొత్తానికి వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత, 'ఏజెంట్‌' పరాజయం తర్వాత వచ్చిన 'లెనిన్'పై అక్కినేని అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే... అఖిల్ కెరీర్‌ పై నీళ్ళు కుమ్మరించినట్టేనని భయపడ్డారు. అయితే 'లెనిన్' కథ మీద నమ్మకం ఉన్న అఖిల్... ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. అతని కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు అందించారు. మూవీకి మొదటిలో కాస్తంత డివైడ్ టాక్‌ వచ్చినా... మరే సినిమా పోటీకి లేకపోవడంతో 'లెనిన్' నిదానంగా పుంజుకుంది. మేకర్స్ సైతం దానిని జనంలోకి తీసుకెళ్ళడానికి తీవ్రంగా కృషి చేశారు. వారందరి కృషి ఫలించి 'లెనిన్' విజయపథంలో సాగింది. ఇప్పుడీ సినిమా 'వంద కోట్ల క్లబ్'లో చోటు సంపాదించుకుంది.


నాగ చైతన్య నటించిన గత చిత్రం 'తండేల్' సైతం వంద కోట్లను సాధించడం విశేషం. ఇప్పుడు నాగచైతన్య 'వృష్ణకర్మ' అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. అఖిల్ కొత్త సినిమా వివరాలు మాత్రం ఇంకా రాలేదు. ఇలా అన్నదమ్ములిద్దరూ వంద కోట్ల క్లబ్ లో చేరిపోవడం అక్కినేని అభిమానులలో ఆనందాన్ని నింపుతోంది. అయితే ఇక ఈ క్లబ్ లో చేరాల్సిన వ్యక్తి అక్కినేని నాగార్జునే. నిజానికి నాగార్జున నటించిన 'కూలీ', 'కుబేర', 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టాయి. కానీ నాగార్జున సోలో హీరోగా మాత్రం ఏ చిత్రమూ ఆ మార్క్ ను దాటలేకపోయింది. ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాను చేస్తున్నారు. ఆ మూవీతో నాగార్జున కూడా వంద కోట్ల క్లబ్ లో చేరిపోతాడేమో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

Spider-Man: Brand New Day Review: స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ

Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

Updated Date - Jul 30 , 2026 | 02:30 PM