Chiranjeevi: ఏఎన్నార్‌తో ఆ జ్ఞాపకం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
ABN, Publish Date - Sep 20 , 2026 | 12:20 PM
తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు (ANR)ది చెరగని అధ్యాయం. నటుడిగా ఎన్నో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. తన ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావంతో తదుపరి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు.
తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు (ANR)ది చెరగని అధ్యాయం. నటుడిగా ఎన్నో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. తన ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావంతో తదుపరి తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన జయంతి సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఏఎన్నార్‌ను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆయనతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘కొంతమంది నటులు తరాలను అలరిస్తారు. మరికొందరు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు’’ అంటూ ఏఎన్నార్ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. ఆయనతో కలిసి నటించిన అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చిరంజీవి నటించిన చిత్రం ‘మెకానిక్ అల్లుడు’. 1993లో విడుదలైన ఈ సినిమాలో ఇద్దరు అగ్ర నటులు ఒకే తెరపై కనిపించడం అప్పట్లో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. ఆ సినిమా తన సినీ ప్రయాణంలో ఎంతో విలువైన అధ్యాయంగా నిలిచిందని చిరంజీవి పేర్కొన్నారు. ఏఎన్నార్‌తో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన సినిమాలు, ఆయన అందించిన సినీ వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతాయని చిరంజీవి అన్నారు. ఏఎన్నార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాలు, పాత్రలు, నటనా వారసత్వం ఎప్పటికీ ప్రేక్షకుల మధ్య సజీవంగానే ఉంటాయని చిరంజీవి అన్నారు.
ALSO READ:
బ్రేకప్ నుంచి ట్రోలింగ్ వరకు.. ఐశ్వర్య లక్ష్మి జీవితంలో ఎన్నో షాకింగ్ అనుభవాలు!
Nani: నేచురల్ స్టార్ నాని అసలు స్వభావం ఇదే!
National Awards: గుజరాత్ కు మారిన నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ వేడుక!