సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఆకాశంలో ఒక తార’ టీమ్‌కు చిరు, చరణ్ అభినందనలు

ABN, Publish Date - Nov 29 , 2026 | 06:32 PM

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ మూవీ టీమ్‌కు చిరంజీవి, రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.

AOT Team with Chiru and Charan

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా.. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో మెరిశారు. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ థియేటర్లలో ‘ఆకాశమంత విజయం’తో దూసుకుపోతోంది.


మెగా ఇంట ఆత్మీయ వేడుక..

సినీ పరిశ్రమలో మంచి కంటెంట్‌తో విజయం సాధించిన ప్రతి చిత్రాన్ని అభినందించడంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎప్పుడూ ముందుంటారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా సక్సెస్ అందుకున్న బృందాలను తన నివాసానికి ఆహ్వానించి ప్రోత్సహించడం ఆయనకు అలవాటు. తాజాగా ఈ జాబితాలోకి ‘ఆకాశంలో ఒక తార’ బృందం కూడా చేరింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) సైతం ఈ చిత్ర యూనిట్‌ను స్వయంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియోలో ఏముందంటే..

చిరంజీవి నివాసానికి వచ్చిన హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ సాత్విక వీరవల్లి, నటి రుహాని శర్మ, దర్శకుడు పవన్ సాధినేని, ఇంకా స్వప్నా దత్‌తో పాటు ఇతర నిర్మాతలను చిరంజీవి, రామ్ చరణ్ ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. చిరు, చరణ్ ఇద్దరూ దుల్కర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని సినిమా విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, రుహాని శర్మ, దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాతలకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత చిత్ర బృందంతో కలిసి చిరంజీవి కాసేపు సరదాగా ముచ్చటిస్తూ, సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. చివరగా ‘ఆకాశంలో ఒక తార’ టీమ్ అంతా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు, సినీ ప్రియులు చిరు, చరణ్‌ల మంచి మనసును కొనియాడుతున్నారు. తమను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి, సినిమాలోని ప్రతి అంశాన్ని ఎంతో ప్రేమతో విశ్లేషిస్తూ అభినందించిన మెగాస్టార్ చిరంజీవికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

ఇవి కూడా చదవండి:

నటుడిగా సుధాకర్ తనయుడు బన్నీ ఎంట్రీ.. చిరు ఇచ్చిన సలహా ఇదే

‘అలియాస్ రుక్మిణీ’లో నితిన్‌ని చూసి నేనే ఆశ్చర్యపోయా: నాని

సమంత, త్రిష, స్నేహ, మృణాళిని‌లకు అతడి చీర కట్టు.. అదుర్స్

Updated Date - Nov 29 , 2026 | 07:28 PM