Vishwambhara: 'విశ్వంభర’ మహాద్రష్ట ఎవరంటే!

ABN , Publish Date - Mar 04 , 2024 | 08:55 PM

చిరంజీవి(Chiranjeevi), వశిష్ట (Vasishta)కాంబినేషన్‌ తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర (Vishwambhara). సింపుల్‌గా చెప్పాలంటే  ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరహా కథ ఇది.

Vishwambhara:  'విశ్వంభర’ మహాద్రష్ట ఎవరంటే!

చిరంజీవి(Chiranjeevi), వశిష్ట (Vasishta)కాంబినేషన్‌ తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర (Vishwambhara). సింపుల్‌గా చెప్పాలంటే  ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరహా కథ ఇది. . అలాంటి కథల్లో మాయలు, మంత్రాలు తప్పనిసరిగా ఉంటాయి. పాజిటీవ్‌ శక్తికీ, నెగిటీవ్‌ ఎనర్జీకీ మధ్య జరిగే పోరు. ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’ చిత్రాన్ని ఓసారి గుర్తు చేసుకుంటే అందులో మాంత్రికుడి పాత్రకూ చాలా ఇంపార్టెన్స్ ఉంది. మహాద్రష్టగా అప్పట్లో ఆ పాత్రలో  అమ్రిష్‌ పురి నటించారు. ఇప్పుడు అలాంటి పాత్రే ‘విశ్వంభర’లోనూ ఉంది. ఆ పాత్రను ఈ చిత్రంలో రావు రమేష్ పోషించనున్నారు. బ్లాక్‌ మ్యాజిక్‌ క్యారెక్టర్‌ అంటే మెడలో పుర్రెల దండ వేసుకొని తిరిగే ఓల్డేజి మాంత్రికుడు కాదు. కాస్త మోడ్రన్‌గానే ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆ పాత్రధారి ఓ శాపం వల్ల నేల మీద కాలు పెట్టలేడు.. గాల్లోనే తిరిగేస్తుంటాడు. దర్శకుడు ఆ పాత్రను అలా వెరైటీగా డిజైన చేశారట.

Rao-ramehs.jpg

ఈ కథలో సంఘర్షణ అనేది ఆ పాత్ర వల్లే వస్తుందని మలుపు తిప్పే పాత్ర కూడా అదేనని చిత్ర బృందం నుంచి సమాచారం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఇంపార్టెన్స ఉన్న చిత్రమిది. దీనిపై ఇప్పటికే దృష్టి సారిస్తున్నారు మేకర్స్‌. స్టార్‌క్యాస్ట్‌ కూడా పెద్దదే. త్రిష, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్‌ కీలక పాత్రధారులు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోకాపేటలో వేసిన ఓ సెట్‌ లో పెళ్లి పాటను తెరకెక్కిస్తున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 08:55 PM