చిరు ‘కాకా’పై థమన్ మాస్ ప్రామిస్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
ABN, Publish Date - Sep 11 , 2026 | 10:32 PM
ఈ ఏడాది ఇప్పటికే ‘మన శంకరవరప్రసాద్ గారు’తో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుని బ్లాక్‌బస్టర్ జోష్‌లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అదే ఊపుతో, ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ మూవీతో దూసుకుపోతున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే ‘మన శంకరవరప్రసాద్ గారు’తో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుని బ్లాక్‌బస్టర్ జోష్‌లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). అదే ఊపుతో, ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ (Kaaka) మూవీతో దూసుకుపోతున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలియంది కాదు. దీంతో ఈ మోస్ట్ క్రేజీ కాంబోపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ బయటకు వచ్చినా, క్షణాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోతోంది. కాగా తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ పిక్ బయటకు వచ్చి నెట్టింట రచ్చ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman).. ‘కాకా’ సెట్స్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ పిక్‌లో చిరంజీవి, థమన్ ఇద్దరూ ఎంతో ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. షూటింగ్ గ్యాప్‌లో చిరంజీవితో సరదాగా గడిపిన ఈ క్షణాన్ని థమన్ షేర్ చేయడంతో, మెగా అభిమానులు ఈ పిక్‌ని తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కేవలం ఫొటో మాత్రమే కాదండోయ్.. ఈ సందర్భంగా ‘కాకా’ సంగీతంపై థమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంచనాలను మార్చేస్తున్నాయి. ఈ సినిమా కోసం తాను తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన, బెస్ట్ వర్క్‌ని అందిస్తున్నట్లు థమన్ ఒక పవర్‌ఫుల్ ప్రామిస్ చేశారు.
అభిమానుల అంచనాలను, మెగాస్టార్ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. సినిమా రేంజ్‌కు తగ్గట్టుగా అదిరిపోయే చార్ట్‌బస్టర్ పాటలు, మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ప్లాన్ చేస్తున్నానని థమన్ చెప్పడంతో.. ‘కాకా’ మ్యూజిక్ ఆల్బమ్‌పై హైప్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయింది. ముఖ్యంగా స్క్రీన్ పై చిరంజీవి గ్రేస్, ప్రెజెన్స్‌కు తగ్గ స్థాయిలో థమన్ మ్యూజిక్ వర్క్ ఉండబోతోందని ఫిలిం నగర్ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. నిజానికి చిరంజీవితో థమన్ కు ఇది మొదటి సినిమా ఏమీ కాదు. గతంలో బ్రూస్ లీ, గాడ్ ఫాదర్ చిత్రాలకి థమన్ మ్యూజిక్ అందించారు. ఆయా సినిమాల్లో ఆయన ఇచ్చిన బిజీఎమ్ థియేటర్లలో ఏ రేంజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో అంతా చూశారు. ఇప్పుడు ‘కాకా’ కోసం మరోసారి మెగాస్టార్‌తో చేతులు కలిపిన థమన్.. తన గత చిత్రాలను మించేలా, ఒక సరికొత్త సౌండింగ్‌తో మెగాస్టార్ మాస్ జాతరను థియేటర్లలో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా కొనసాగుతోంది. త్వరలోనే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ రానున్నాయి. మరి మెగాస్టార్ చిరంజీవి మాస్ ప్రెజెన్స్‌కి థమన్ ఎలాంటి మ్యూజిక్ బ్లాస్ట్ ఇవ్వబోతున్నాడో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
ప్రముఖ ఓటీటీ లైన్‌లోకి.. ‘విశ్వంభర’ రిలీజ్‌కు క్లియరెన్స్ వచ్చినట్టేనా?
రామాయణం టు శ్రీమద్భాగవతం.. భారీ సినిమాటిక్ యూనివర్స్‌కు సాగర్ పిక్చర్స్ శ్రీకారం
స్టార్ హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తా.. నన్నిలా కనెక్ట్ అవ్వొచ్చు: ఉదయభాను