సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిరు లీక్స్: ‘కాకా’ క్యారెక్టర్ పేరు లీక్.. ఎంత పని చేశావ్ స్రవంతి?

ABN, Publish Date - Sep 20 , 2026 | 03:20 PM

తాజాగా మెగాస్టార్ మరోసారి తన చిత్రం ‘కాకా’కు సంబంధించిన ఓ పవర్‌ఫుల్ అప్‌డేట్‌ను స్టేజ్ పైనే లీక్ చేసి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.

Chiru Kaaka Leak

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఏదైనా ఈవెంట్‌లో మైక్ పట్టుకున్నారంటే ఫ్యాన్స్‌కు పండగే. సినిమా కబుర్లతో పాటు సరదాగా ఏదో ఒక క్రేజీ సీక్రెట్‌ను బయటపెట్టే ఆయన ‘చిరు లీక్స్’ (Chiru Leaks) ట్రెండ్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా మెగాస్టార్ మరోసారి తన చిత్రానికి సంబంధించిన ఓ పవర్‌ఫుల్ అప్‌డేట్‌ను స్టేజ్ పైనే లీక్ చేసి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. అయితే, ఈసారి చిరు లీక్ వెనుక బిగ్‌బాస్ బ్యూటీ, యాంకర్ స్రవంతి చొక్కారపు ప్రధాన కారణంగా నిలవడం విశేషం!

మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’ (Kaaka). కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసింది. కాగా, తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో స్టేజ్‌పై మాట్లాడుతున్న చిరంజీవి వద్దకు మైక్ పట్టుకుని యాంకర్ స్రవంతి చొక్కారపు వచ్చింది. తన ఊరు కదిరి అని, తనది అనంతపురం జిల్లా అని చెబుతూ చిరంజీవితో ముచ్చటించింది.


స్రవంతి మాటలు విన్న వెంటనే మెగాస్టార్‌లోని సరదా కోణం బయటకు వచ్చింది. ఆమె వైపు చూపిస్తూ.. ‘‘తన ఊరి పేరునే నా సినిమాలో నా క్యారెక్టర్‌కి పెట్టాము’’ అంటూ పక్కనే ఉన్న వారిని, ఆడియన్స్‌ను సస్పెన్స్‌లో పడేశారు. అంతటితో ఆగకుండా అందరూ ఆశ్చర్యపోయేలా తన క్యారెక్టర్ పేరు ‘కదిరి కాళిదాస్’ అని ఒక్కసారిగా రివీల్ చేసేశారు. దీంతో ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ విజిల్స్, కేకలతో దద్దరిల్లిపోయింది.


చిరు లీక్‌తో స్రవంతి మురిసిపోతుంటే.., పక్కన ఉన్నవారంతా నవ్వుతూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ‘‘అంతా స్రవంతి వల్లే జరిగింది.. ఆమె తన ఊరి పేరు చెప్పేసరికి చిరు ఇలా లీక్ చేసేశారు’’ అంటూ నెటిజన్లు ఈ వీడియో క్లిప్‌ను తెగ షేర్ చేస్తున్నారు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో ఊరమాస్ హిట్ కొట్టిన చిరు-బాబీ జోడీ.. ఇప్పుడు ‘కదిరి కాళిదాస్’ అలియాస్ ‘కాకా’తో.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎగ్జయిట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ట్రోలర్లకు వార్నింగ్.. బిగ్‌బాస్‌లో షర్ట్ విప్పి సల్మాన్ రచ్చ

ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం విజయ్ అన్నే: అట్లీ

ఐదు కాదు.. టాలీవుడ్ సినిమాకు మరో మూడు కావాలి

Updated Date - Sep 20 , 2026 | 03:30 PM