పూరి జగన్నాథ్ శిష్యుడి దర్శకత్వంలో 'చకోర'

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:02 PM

'చకోర' మూవీ టీజర్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్‌ నాయుడు విడుదల చేశారు. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది.

Chakora Movie teaser launch

శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా 'చకోర- లూనార్ లవ్ బర్డ్'. ఈ చిత్రాన్ని డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న 'చకోర' గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది.

ఇదిలా ఉంటే... కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా 'చకోర' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన రామ్మోహన్ నాయుడు చిత్ర దర్శక నిర్మాతలకు, ఇతర బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు. టీజర్ విషయానికి వస్తే.. అందమైన వైజాగ్ నేపథ్యంలో సాగే సరికొత్త ప్రేమ కథతో ఈ సినిమా రూపొందినట్లు టీజర్ తో తెలుస్తోంది. 'ఇది మామూలు ప్రేమ కథ కాదు, అమ్మ చెప్పిన ప్రేమ కథ, అమ్మ చెప్పిన ప్రేమ కథే కాదు అబ్బాయి ప్రేమ కథ, అబ్బాయి ప్రేమ కథే కాదు అమ్మాయి ప్రేమ కథ కూడా, ఇది మామూలు ప్రేమ కాదు. ఇది చకోర ప్రేమ కథ' అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. జాబిల్లి చేరేందుకు ప్రయత్నించే చకోర పక్షిని సింబాలిక్ గా చెబుతూ హీరో క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేయడం కొత్తగా అనిపిస్తోంది. తన ప్రేయసి జూలీ ఎక్కడుందో వెతికేందుకు హీరో తీవ్ర ప్రయత్నాలు చేయడం టీజర్ లో చూపించారు. హీరో తన జూలీని చేరుకున్నాడా లేదా అనే క్యూరియాసిటీని టీజర్ క్రియేట్ చేసింది.


ఈ సినిమా గురించి దర్శకుడు మంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, 'చకోర పక్షి ఒక యూనిక్ బర్డ్. తన దాహాన్ని తీర్చుకునే ప్రాసెస్‌లో స్వచ్ఛమైన వాన చినుకులనే త్రాగుతుంది తప్ప ఏది పడితే అది త్రాగదు. ఆ వర్షపు చినుకుల కోసం అప్పటివరకూ నిరీక్షిస్తూ ఉంటుంది. ఈ కథలో హీరో కూడా అంత స్వచ్ఛమైన ప్రేమికుడు అని చెప్పడానికి ఈ చిత్రానికి 'చకోర' టైటిల్ పెట్టాం. జాబిలిని చేరుకునే ప్రయత్నంలో చకోర పక్షి మరణానికైనా సిద్థపడుతుంది. మరి తన ప్రేయసి జాబిలిని చేరుకునే ప్రయత్నంలో హీరో మరణించాడా లేదా తన అంతులేని ప్రేమతో మరణాన్నే జయించాడా అన్నదే కథ. లవ్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిజం అన్నీ ఇందులో ఉన్నాయి' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Rambha Oorvasi Menaka: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ

సినిమా రివ్యూ: ధర్మస్థల నియోజకవర్గం

సినిమా రివ్యూ: బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌

Romanchakam Review: సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’ రివ్యూ

Updated Date - Sep 04 , 2026 | 04:05 PM