సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఒకే రోజు రెండు సినిమాలతో చైతన్య జొన్నలగడ్డ సందడి!

ABN, Publish Date - Nov 20 , 2026 | 01:27 PM

సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ నటించిన ఆకాశంలో ఒక తార, ఓం సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. రెండు చిత్రాల్లోనూ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Chaitanya Jonnalagadda

యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ 'బబుల్ గమ్‌' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అందులో హీరోగా నటించిన సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్‌ తండ్రిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత చైతన్య జొన్నలగడ్డ 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంలో హీరోయిన్ తండ్రిగా, దివ్యాంగుడిగా నటించాడు. ఈ మూవీ చక్కని విజయాన్ని అందుకోవడంతో చైతన్య ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. నాని 'హిట్‌ 3'లో చైతన్య కాప్‌గా నటించాడు. ఈ యేడాది ఇప్పటికే విడుదలైన 'రమణీ కళ్యాణం'లోనూ చైతన్య జొన్నలగడ్డ నటించాడు.


విశేషం ఏమంటే... ఇప్పుడు చైతన్య జొన్నలగడ్డ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. అవే 'ఆకాశంలో ఒక తార', 'ఓం'. ఇందులో ఒకటి స్ట్రయిట్‌ తెలుగు సినిమా కాగా మరొకటి తమిళ డబ్బింగ్‌. ఈ రెండు కూడా తండ్రీకొడుకులు మమ్ముట్టీ, దుల్కార్ సల్మాన్ చేసిన సినిమాలు. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన దుల్కర్ సల్మాన్‌ 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో శ్రుతీహాసన్ బిజినెస్ పార్ట్ నర్ గా, ఆమెకు చేదోడు వాడోదుగా ఉండే వ్యక్తిగా చైతన్య జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించాడు. ఇక మమ్మట్టీ కీలక పాత్ర పోషించిన ధనుష్‌ 'ఓం'లో బ్యాడ్‌ కాప్ పాత్రను చైతన్య పోషించాడు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌ లోకి అడుగుపెట్టి, చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం చెట్లను నరికే కూలీలను నిర్దాక్షిణ్యంగా ఎన్ కౌంటర్‌ చేసే పోలీస్‌ ఆఫీసర్ గా చైతన్య జొన్నలగడ్డ క్యూయల్‌ క్యారెక్టర్ చేశాడు.


సహజంగానే మంచి నటుడైన చైతన్య జొన్నలగడ్డలో అతని తమ్ముడిలానే మంచి రచయిత కూడా ఉన్నాడు. చైతన్య జొన్నలగడ్డ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న 'మోసెస్‌ మాణిక్‌ చంద్ పార్ట్ -2' అనే సినిమాను నిర్మిస్తున్నట్టు ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. దీనికి 'బొమ్మ బ్లాక్ బస్టర్' ఫేమ్‌ రాజ్ విరాట్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. అలానే 'జిల్లేడు చెట్టు' అనే సినిమాలోనూ చైతన్య నటిస్తున్నాడు. శుక్రవారం విడుదలైన 'ఆకాశంలో ఒక తార, ఓం' చిత్రాలు పాజిటివ్‌ టాక్‌తో ముందుకు సాగుతున్నాయి. దాంతో చైతన్యకు మరిన్ని మంచి పాత్రలు ఇతర భాషల్లోనూ లభించే ఆస్కారం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి:

Rashmika Mandanna: నా భర్త విజయ్ దేవరకొండ ద్వారా.. సత్యసాయి తత్వం తెలిసింది

‘సలార్-2’ కంటే ముందే ‘డ్రాగన్-2’.. నీల్ ప్లాన్ ఇదేనా?

బోయపాటికి బన్నీ గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఊహించని ట్విస్ట్

Updated Date - Nov 20 , 2026 | 01:36 PM