BuchiBabu: చిరంజీవిని డైరెక్ట్‌గా అడిగేశాడు.. వెళ్లు వెళ్లవయ్యా..

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:33 PM

‘ఉప్పెన’ చిత్రంతో భారీ విజయం అందుకుని ఓవర్‌నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు బుచ్చిబాబు సానా. రెండో సినిమాకే రామ్‌చరణ్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు.

‘ఉప్పెన’ చిత్రంతో భారీ విజయం అందుకుని ఓవర్‌నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు బుచ్చిబాబు సానా (Buchi babu Sana). రెండో సినిమాకే రామ్‌చరణ్‌ను (Ram Charan) డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘పెద్ది’.  జూన్‌ 4న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పది రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌ రూ.378 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా చిత్ర బృందం తో చిరంజీవి ముచ్చటించారు. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని ఓ అవకాశం ఇవ్వమని అడిగారు.  బుచ్చిబాబు మాట్లాడుతూ ‘సార్‌, నేను మీకు ‘ఉప్పెన’ కథ చెప్పాను. ఓకే చెప్పి వైష్ణవ్‌ తేజ్‌తో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అలాగే రామ్‌ చరణ్‌ గారు నాకు ‘పెద్ది’ సినిమా చేేసే అవకాశం ఇచ్చారు. మీరు కూడా ఒక అవకాశం ఇస్తే మీతో సినిమా చేస్తాను’ అంటూ చిరంజీవిని అడిగారు బుచ్చిబాబు.  

దీనికి చిరంజీవి సరదాగా స్పందించారు. ‘ఈ వయసులో నన్ను పరిగెత్తమని, దూకమని, రోప్స్‌ కట్టి పైకి కిందికి వదిలేలా పెద్ద సాహసాలు చేయమంటే వెళ్లు వెళ్లవయ్యా అంటాను (నవ్వుతూ). నీతో సినిమా చేయడం కష్టమయ్యా’ అని చిరంజీవి అనగా.. వెంటనే బుచ్చిబాబు అందుకుని ఇప్పటికీ మీరు అలాంటివే చేస్తున్నారు కదా సర్‌ అనగానే, చిరంజీవి నవ్వుతూ 'ఇప్పటికీ రోప్స్‌ కడుతున్నారు.. పైకి లేపుతున్నారు.. కింద పడేస్తున్నారు.. కష్టపడుతున్నాం. కానీ పనికి అవసరం అనిపించినప్పుడు దేనికీ వెనకడుగు వేసేది లేదు. ఎంత కష్టమైనా సరే సెట్‌లోకి వెళ్లగానే ఆ జోరు వచ్చేస్తుంది’ అని చిరంజీవి అన్నారు. చిరు ఓకే అంటే బుచ్చి కథ రెడీ చేయడానికి సిద్ధమే అనే చర్చ నడుస్తోంది. 

ఇవి కూడా చదవండి:

దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో!

‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా?

వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!

Updated Date - Jun 14 , 2026 | 07:11 PM