Ramayana: ‘రామాయణ’కు పైరసీ భయం.. ముంబై హైకోర్టు కీలక ఆదేశాలు..
ABN, Publish Date - Nov 03 , 2026 | 12:53 PM
రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’
రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ (Ramayana). ఈ సినిమా కోసం. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఏంటో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. నమిత మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాకు విడుదలకు ముందే ఓ చిక్కు ఎదురైంది. మేకర్స్ కు పైరసీ భయం పట్టుకుంది. ఈ సమస్యను అడ్డుకునేందుకు బాంబే హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా దృశ్యాలను అక్రమంగా రికార్డు చేయడం, వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, అనధికారికంగా స్ట్రీమింగ్ చేయడంపై న్యాయస్థానం నిషేధం విధించింది. పైరసీ కారణంగా సినిమా హక్కులకు, ఆదాయానికి నష్టం వాటిల్లకుండా రక్షణ కల్పించాలని కోరుతూ గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మాధవ్ జమ్దార్ ఇంటర్మీడియట్ ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా కంటెంట్‌ను అక్రమంగా ప్రసారం చేసే వెబ్సైట్లు, మిర్రర్ సైట్లను గుర్తించి తొలగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, సోషల్ మీడియా సంస్థలకు స్పష్టం చేశారు. పైరసీకి సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత లింకులను బ్లాక్ చేయడం, కంటెంట్‌ను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రెండు భాగాలకు రూ.4 వేల కోట్ల వ్యయం..
ఈ విచారణలో ‘రామాయణ’ నిర్మాణ వ్యయం కూడా చర్చకు వచ్చింది. సినిమా తొలి భాగం కోసం సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు నిర్మాతలు కోర్టుకు వివరించారు. రెండు భాగాలకు కలిపి మొత్తం రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు వెల్లడించారు. ఇంతటి భారీ ప్రాజెక్ట్ కావడంతో పైరసీ వల్ల కలిగే నష్టాన్ని నివారించడం అత్యంత కీలకమని మేకర్స్ భావిస్తున్నారు. ప్రివ్యూల సమయంలోనూ కఠినమైన నిబంధనలు అమలు చేసినట్లు నిర్మాతలు తెలిపారు. అయినప్పటికీ, రెండు ట్రైలర్లను కొందరు రహస్యంగా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సినిమా కంటెంట్‌కు డిజిటల్ రక్షణ కల్పించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం చిత్ర బృందానికి ఊరటనిచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 16న జరగనుంది.
ALSO READ:
Ritika Singh: నా పేరుతో.. నాకు తెలియకుండానే సబ్ స్క్రిప్షన్ రూ.400 వసూలు చేస్తున్నారు
Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. షార్ట్ గన్ గేమ్స్‌లో పెట్టుబడి!
Sundar C: నిజాలు తెలుసుకోకుండా.. వార్తలు రాయడం బాధిస్తుంది