సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Biggboss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా?

ABN, Publish Date - Sep 05 , 2026 | 01:12 PM

బుల్లితెరపై  ‘బిగ్‌బాస్' రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.  త్వరలో 10వ సీజన్ ప్రారంభం కానుంది.  సీజన్‌కు ముందు కంటెస్టెంట్ల సెలక్షన్ విషయంలో పెద్ద కసరత్తే జరుగుతుంటుంది.

బుల్లితెరపై  ‘బిగ్‌బాస్' రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.  త్వరలో 10వ సీజన్ ప్రారంభం కానుంది.  సీజన్‌కు ముందు కంటెస్టెంట్ల సెలక్షన్ విషయంలో పెద్ద కసరత్తే జరుగుతుంటుంది. ఇప్పుడు సీజన్ 10కు సంబంధించిన పలువురు సినీ, టీవీ సెలబ్రిటీల పేర్లు కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. అందులో యాంకర్ వర్షిణి, ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, కృష్ణుడు, వంశీ, ఆదిత్ ఈశ్వరన్, ముఖేష్ గౌడ, డెబ్ జానీ పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

‘అగ్ని పరీక్ష’ ద్వారా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్న కంటెస్టెంట్ల జాబితాలో రోహిత్ నాయుడు, షాలిని, సృష్టి వ్యాకరణం, చరణ్, ఝాన్సీ, రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. అయితే సీజన్ 10లో అసలు కంటెస్టెంట్లు ఎవరు? వీరిలో ఎంతమందికి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ దక్కుతుంది? అనే విషయాలపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్వరలో స్టార్ మా లో ప్రసారం కాబోయే ఈ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. 

ALSO READ:

Vishwambhara: OTT డీల్‌ కోసమే ఎదురుచూపులు.. డీల్‌ లాక్ అయితే రిలీజ్ డేట్‌ ఫిక్స్!

ఇత‌నే నా ల‌వ‌ర్‌.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్‌

Updated Date - Sep 05 , 2026 | 03:12 PM