Varshini- Mukesh: ఛీఛీ.. ముద్దులు, హగ్గులు ఇచ్చి అన్నాచెల్లెళ్లు అంటుందేంటి
ABN, Publish Date - Nov 28 , 2026 | 06:07 PM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ముఖేష్, వర్షిణి జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా, తాజాగా ముఖేష్ తనకు అన్నయ్య లాంటివాడంటూ వర్షిణి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు, ట్రోలింగ్ చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 (Bigg Boss Telugu Season 10) గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్ని సీజన్స్ వేరు ఈ ఒక్క సీజన్ వేరు. అంతకుముందు సీజన్స్ లో ఫన్, గేమ్స్, బాండింగ్స్.. ఇలా అన్ని ఉండేవి. కానీ, ఈ సీజన్ లో బూతులు, గొడవలు, మోసాలు.. ఇవే కనిపిస్తున్నాయి. రోహిత్ వెళ్లిపోయాకా ఆ హౌస్ ని కొంచెం చూడగలుగుతున్నామని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ముఖేష్ (Mukhesh), వర్షిణి (Varshini) జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వచ్చింది. తొలుత హౌస్‌లోకి అడుగుపెట్టగానే దేబ్జాని, ముఖేష్ జంటగా మారతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ముఖేష్ - వర్షిణి మధ్య బలమైన బాండింగ్ ఏర్పడింది. హౌస్ మొత్తం ఒకవైపు నిలిస్తే వీరిద్దరూ మాత్రం మరోవైపు నిలబడుతూ, వర్షిణి కేవలం ముఖేష్ కోసమే హౌస్‌లో ఉంటుందా అనేంతలా అతని కోసం గేమ్ ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇక వీరిద్దరి మధ్య ముద్దులు, హగ్గులు, పట్టుకోవడాలు వంటి సీన్లు హౌస్‌లో తరచూ కనిపించాయి. ప్రతి సీజన్లోలాగే వీరు కూడా ప్రేమాయణం నడిపిస్తున్నారని ప్రేక్షకులు, హౌస్మేట్స్ భావించారు. ఇప్పటివరకు వర్షిణి ఒక్క గేమ్‌లోనూ గెలవకపోయినా, ముఖేష్ మాత్రం ఆమెను స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ వెనకేసుకొచ్చేవాడు. నాగార్జున ఎన్నిసార్లు వీరిద్దరిని విడదీసే ప్రయత్నం చేసినా, ఎక్కడా విడిపోకుండా ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వచ్చారు. ఇంత జరిగిన తర్వాత సడన్‌గా వర్షిణి ఇచ్చిన ట్విస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. రామకృష్ణ, ముఖేష్, వర్షిణి మాట్లాడుకుంటున్న సమయంలో.. 'మేమిద్దరం అన్నాచెల్లెళ్లలా ఉంటాం కదా' అంటూ పోలికలు చెప్పుకొచ్చింది. ముఖేష్ తనకు అన్నయ్య అన్నట్టుగా వర్షిణి మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు, బిగ్ బాస్ ప్రేక్షకులు వర్షిణిని విమర్శిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. 'ఛీఛీ.. ఇప్పటివరకు ముద్దులు, హగ్గులు ఇచ్చి ఇప్పుడు అన్నయ్య అంటావా? అసలు అలా అనాలని ఎలా అనిపించింది నీకు?' అంటూ సెటైర్లు వేస్తున్నారు. అన్నాచెల్లెళ్లు అంటే ఇలాగే ఉంటారా, గేమ్ కోసం లేదా కవర్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు అవసరమా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు .మరి ముందు ముందు వర్షిణి- ముకేష్ లపై ఎలాంటి ట్రోల్స్ వస్తాయో చూడాలి.
Also Read:
మోక్షజ్ఞ చిత్రంలో ఎన్టీఆర్.. థియేటర్లలో విధ్వంసమే
స్విట్జర్లాండ్ వేదికపై అన్నమయ్య కీర్తన.. ఇది కదా తెలుగోడి పవర్ అంటే
విశ్వక్ ‘లెగసీ’ షూటింగ్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే