Bigg Boss 10: షాకింగ్.. హౌస్ నుంచి రోహిత్ ఎలిమినేట్
ABN , Publish Date - Oct 31 , 2026 | 09:22 PM
రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) అన్ని సీజన్స్ లో ది వరెస్ట్ సీజన్ అని అనిపించుకుంది సీజన్ 10. 9 సీజన్స్ లో కామెడీ, కొట్లాటలు, స్నేహం, బాండింగ్స్ ఇలా అన్ని సమపాళ్లుగా ఉండేవి.
రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) అన్ని సీజన్స్ లో ది వరెస్ట్ సీజన్ అని అనిపించుకుంది సీజన్ 10. 9 సీజన్స్ లో కామెడీ, కొట్లాటలు, స్నేహం, బాండింగ్స్ ఇలా అన్ని సమపాళ్లుగా ఉండేవి. కానీ, ఈ సీజన్ లో మాత్రం బూతులు, గొడవలు, కలహాలు, వివాదాలు ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతివారం నామినేషన్స్ లో రోహిత్ - త్రిగుణ్ ల మధ్య జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలంటే వీరి గొడవల వలనే బిగ్‌బాస్ కి ఎక్కువ రేటింగ్ వచ్చిందని చెప్పొచ్చు. రోహిత్ అనవసరమైన కోపం, బూతులు, నిందలు వేయడం, నెగిటివిటీ.. ఇలా అన్ని విషయాల్లో రోహిత్ పై నెటిజన్స్ కోపం గా ఉన్నారు.
ఇప్పటివరకు జరిగిన టాస్క్ లలో రోహిత్ గెలవడం చాలా తక్కువ. కేవలం ఆ గొడవల వలనే ఇంకా రోహిత్ హౌస్ లో ఉన్నాడని కొందరు..లేదు అసలు రోహిత్ లేకపోతే బిగ్‌బాస్ సీజన్ 10 లేదు అని ఇంకొందరు డిబేట్ లు పెట్టుకుంటూ వస్తున్నారు. బిగ్‌బాస్ కూడా తనను ఏం పీకలేడని డైరెక్ట్ గా చెప్పిన రోహిత్ ఈ వారం ఎలిమినేట్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరుగుతున్న విషయం తెల్సిందే. లాస్ట్ వీక్.. షాలిని, దక్షి ఎలిమినేట్ అయ్యారు. ఈ వీక్ లో కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది.
ఒక ఎలిమినేషన్ ప్రజల ఓటింగ్ ద్వారా జరిగితే.. ఇంకో ఎలిమినేషన్ హౌస్మేట్స్ వేసిన ఓటింగ్ ద్వారా జరగనుంది. ఇక హౌస్మేట్స్ వేసిన ఓటింగ్ ఆధారంగా రోహిత్ ఎలిమినేట్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఎలిమినేట్ అయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్లను సీక్రెట్ రూమ్‌లోకి పంపి తిప్పి తీసుకురావడం బిగ్‌బాస్‌లో పరిపాటి. అయితే ఈసారి రోహిత్ విషయంలో ఎలాంటి సీక్రెట్ రూమ్ ఆప్షన్ ఇవ్వలేదని, నేరుగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి పంపించేశారని ప్రచారం సాగుతోంది. హౌస్మేట్స్ నిర్ణయం వల్ల రోహిత్ ఎలిమినేట్ అవ్వడం అభిమానులకు తీవ్ర షాకింగ్‌గా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.