‘లెనిన్’తో భాగ్యం లక్ మారినట్లేనా..
ABN, Publish Date - Jul 11 , 2026 | 03:48 PM
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిరోజూ ఎంతో మంది కొత్త తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. అందులో కొంతమంది మాత్రమే తొలి చూపులోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ఆ కోవకు చెందిన అందమైన భామ భాగ్యశ్రీ బోర్సే.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిరోజూ ఎంతో మంది కొత్త తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. అందులో కొంతమంది మాత్రమే తొలి చూపులోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ఆ కోవకు చెందిన అందమైన భామ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). రవితేజ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాతో తెలుగు నాట అడుగుపెట్టిందీ ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆడియెన్స్ అటెన్షన్‌ను అమాంతం తనవైపు తిప్పుకుంది. తెరపై ఆమె కనిపించిన విధానం, డాన్సులు, గ్లామర్ చూసి కుర్రకారు ఫిదా అయ్యారు.
అయితే, ఎంట్రీ అదిరిపోయినా, లక్ పరంగా మాత్రం ఈ బ్యూటీ కాస్త వెనకబడిపోయిందనే చెప్పాలి. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. యావరేజ్, డిజాస్టర్ రిజల్ట్స్ రావడంతో అమ్మడి కెరీర్ ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది. టాలీవుడ్‌లో నిలదొక్కుకుంటుందా లేదా అన్న సందేహాలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా, మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ (Lenin) చిత్రం ఈ భామ పాలిట వరంగా మారింది. ఈ భారీ ప్రాజెక్టులో భాగ్యశ్రీకి అనుకోకుండా ఆఫర్ రావడం.. అమ్మడికి అతిపెద్ద ప్లస్ పాయింట్ అయింది. కెరీర్ ఆరంభంలో ఆశించిన ఫలితాలు రాకపోయినా, ఈ సినిమా అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని తన సత్తా చాటింది. ఇప్పటివరకు లక్ మొహం చూడని ఈ ముద్దుగుమ్మకు ‘లెనిన్’ రూపంలో ఒక సాలిడ్ గ్రాండ్ హిట్ లభించింది. సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో పాటు, సినిమా కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతుండటం.. భాగ్యశ్రీ దశను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో అఖిల్‌కు పోటీగా భాగ్యశ్రీ కొన్ని సన్నివేశాల్లో నటించిందన్న టాక్ కూడా బాగా స్ప్రెడ్ అయింది. ప్రస్తుతం ఈ గ్రాండ్ హిట్ సక్సెస్‌ను అమ్మడు ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఏ హీరోయిన్‌కైనా కావాల్సింది కూడా ఇదే కదా.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో పెరిగితే ఆటోమేటిక్‌గా ఆఫర్ల క్యూ కడుతుందనేది కాదనలేని వాస్తవం. ఇప్పుడు భాగ్యశ్రీ విషయంలో అక్షరాలా అదే జరగనుంది. ‘లెనిన్’ సక్సెస్‌తో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థలు, క్రేజీ డైరెక్టర్లు ఆమెను తమ తదుపరి చిత్రాల్లో నటింపజేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారనేలా అప్పుడే వార్తలు కూడా మొదలయ్యాయి. కేవలం తెలుగు వరకే పరిమితం కాకుండా, పొరుగు ఇండస్ట్రీలపై కూడా ఈ బ్యూటీ కన్నేసింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మల్లూవుడ్‌లలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయింది. అందులో భాగంగానే, ప్రస్తుతం తమిళంలో ‘సెయోన్’ అనే చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం డబ్బింగ్. సాధారణంగా పరభాషా నటీమణులు ఇక్కడ సినిమాలు చేస్తే, వారి పాత్రలకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పిస్తారు. కానీ భాగ్యశ్రీ ఇక్కడే తన ప్రత్యేకతను చాటుకుంది. తన మొదటి సినిమా నుంచి తన పాత్రలకు తానే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది. భాష రాకపోయినా, పట్టుదలతో నేర్చుకుని సొంత వాయిస్‌తో డైలాగ్స్ చెప్పడం అనేది ఆమె కెరీర్‌కు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. గ్లామర్, నటనతో పాటు భాషపై కూడా పట్టు సాధిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ తార భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. టాలెంట్ ఉండి టైమ్ కోసం వెయిట్ చేసిన ఈ బ్యూటీకి.. మొత్తానికి చాలా రోజులకు అసలైన భాగ్యం వరించిందన్న మాట.
ఇవి కూడా చదవండి:
అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్!
సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం: బ్రహ్మానందం
టూర్‌కు రెడీ అవుతోన్న ప్రభాస్.. వచ్చాక ఇక ర్యాంపే!