Balakrishna: నందమూరి నటసింహం లైనప్ మారలేదు...
ABN , Publish Date - Jun 11 , 2026 | 02:41 PM
నటసింహం బాలకృష్ణ బర్త్ డేన రిలీజైన న్యూ మూవీ గ్లింప్స్ భలేగా సందడి చేస్తోంది. బాలయ్య వరుస సినిమాల లైనప్ మారిందని వినిపించింది. అయితే ఆయన బర్త్ డే పిక్స్ చూస్తే స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.
బాలకృష్ణ (Balakrishna) హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పటికైతే టైటిల్ నిర్ణయించలేదు- అందువల్ల 'యన్బీకే 111' అనే పిలుస్తున్నారు. జూన్ 10వ తేదీన బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజయింది. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో బాలకృష్ణ విగ్ బాగా సెట్ అయింది - మునుపటి కన్నా మరింత సన్నగా కనిపిస్తున్నారు. మోటార్ బైక్ పై స్టైలిష్ లుక్ తో ఇట్టే అభిమానులను ఆకట్టుకున్నారు.
ద కింగ్ ఆఫ్ కేవోస్ !
ఇప్పటి దాకా 'గాడ్ ఆఫ్ మాసెస్' గా జేజేలు అందుకున్న బాలకృష్ణను ఈ బర్త్ డే స్పెషల్ - గ్లింప్స్ లో 'ద కింగ్ ఆఫ్ కేవోస్'గా అభివర్ణించడం విశేషం. వాస్తవానికి హిస్టరీలో 'ద కింగ్ ఆఫ్ కేవోస్' అన్న పదాలు జపాన్ మైథలాజీలోనూ, కొన్ని వీరోచిత గాథల్లోనూ వినిపిస్తుంది. 'గ్రేట్ నెస్' కోసం ఉపయోగించే 'ద కింగ్ ఆఫ్ కేవోస్' లైన్ తోనే ఫ్యాన్స్ ను ఫిదా చేశారు మేకర్స్. ఈ సినిమాను ఈ దసరాకే రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. దీని తరువాత కొరటాల శివ (Koratala Shiva) డైరెక్షన్ లో బాలయ్య సినిమా పట్టాలెక్కనుంది. ఆ తరువాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ చిత్రం, విజయ్ కనకమేడల నిర్దేశకత్వంలో మరో సినిమా ఉంటుందని వినిపించింది. ఈ లైనప్ చూసి బాలయ్య స్పీడే స్పీడు అనుకున్నారు జనం.
బాలకృష్ణతో కొరటాల శివ సినిమా ఉంటుంది కానీ, వివేక్ ఆత్రేయ (Vivek Atreya), విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) సినిమాలు డౌటే అనే టాక్ కొన్ని రోజుల ముందు వినిపించింది. అయితే బాలయ్య బర్త్ డేన వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల ఇద్దరూ బాలయ్యను వేర్వేరుగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు బాలకృష్ణతో 'వీరసింహారెడ్డి' వంటి బంపర్ హిట్ చూసిన మైత్రీ మూవీమేకర్స్ ఆయనతో మరో మూవీ నిర్మించనుందని సమాచారం.. బర్త్ డేన బాలయ్యను అభినందించిన వారిలో మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ తో పాటే వివేక్ ఆత్రేయ కూడా ఉండడంతో ఈ కాంబినేషన్ కన్ఫమ్ అని అందరూ భావిస్తున్నారు. అలాగే విజయ్ కనకమేడల మూవీ కూడా ఉంటుందని తెలుస్తోంది. అందువల్ల ముందుగా వినిపించినట్టుగానే బాలయ్య వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారన్నది వాస్తవమే అని తెలుస్తోంది.
అచ్చివొచ్చిన 'ఆరు'
బాలకృష్ణకు '6' నంబర్ అచ్చివస్తుందని అభిమానుల నమ్మకం. 1986లో ఆయన నటించిన ఏడు చిత్రాల్లో వరుసగా ఆరు సినిమాలు హిట్స్ గా నిలిచాయి. అలా తెలుగు చిత్రసీమలో ఒకే సంవత్సరం వరుసగా ఆరు హిట్స్ చూసిన చరిత్ర ఎవరికీ లేదు. అలాగే జూన్ 10న బాలయ్య '66' ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రిలీజైన బాలయ్య 111వ చిత్రం గ్లింప్స్ అలరిస్తోంది. ఆ సినిమా ఖచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే వరుసగా మళ్ళీ ఆరు హిట్స్ బాలయ్యను చేరతాయనీ అభిమానులు ఆశిస్తున్నారు. మరి రాబోయే చిత్రాల్లో బాలయ్య ఏ తీరున ఫ్యాన్స్ ను మురిపిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Krishnam Raju: ఆరు పదుల.. రెబల్ స్టార్!
బుట్టబొమ్మకి తప్పని ‘ఐరన్ లెగ్’ శాపం..
Ravi Mohan: భార్యకు నెలకు రూ.40 లక్షల భరణం.. హీరో రవి మోహన్‌కు కోర్టులో చుక్కెదురు