సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మ‌రో సినిమాతో సంక్రాంతి బ‌రిలోకి బాల‌య్య! డైరెక్టర్ ఎవ‌రంటే?

ABN, Publish Date - Apr 22 , 2026 | 12:45 PM

గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య ఎవరితో పని చేస్తారనే విషయంలో ఇండస్ట్రీలో రకరకాల పేర్లు వినిపించాయి.

Balakrishna

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వేగం చూస్తుంటే కుర్ర హీరోలు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో 'అఖండ-2' వంటి భారీ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాస్ జాతర సృష్టించిన ఆయన, ఏమాత్రం విరామం తీసుకోకుండా తన తదుపరి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌పై దృష్టి సారించిన బాలయ్య, ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య ఎవరితో పని చేస్తారనే విషయంలో ఇండస్ట్రీలో రకరకాల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తో ఆయన జత కట్టబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. కొరటాల శివ తనదైన సామాజిక సందేశంతో కూడిన మాస్ కథలను రూపొందించడంలో దిట్ట. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇప్పటికే ప్రాథమికంగా కథా చర్చలు ముగిశాయని, కొరటాల చెప్పిన లైన్‌కు బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

మరోవైపు కొరటాల శివ 'దేవర' వంటి భారీ విజయం తర్వాత తన తదుపరి అడుగుపై క్లారిటీ ఇవ్వలేదు. 'దేవర-2' ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా బాలయ్యతో ఒక సెన్సేషనల్ సినిమా చేయాలని కొరటాల భావిస్తున్నారట. సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ కథకు బాలయ్య ఓకే చెప్పడం విశేషం. గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ జరుగుతుండగానే, సమాంతరంగా ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం. బాలయ్య క్రేజ్, కొరటాల బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించ నున్నారట. అంతేకాదు, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి (Sankranti) కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. సంక్రాంతి సీజన్ అంటేనే నందమూరి అభిమానులకు పూనకాలు వస్తాయి, అటువంటిది కొరటాల లాంటి దర్శకుడితో సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగ రాయడం ఖాయమని భావిస్తున్నారు.

సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. బాలయ్యలోని మాస్ యాంగిల్‌ను కొరటాల తన స్టైల్‌లో ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు సంబర పడుతున్నారు. బాలయ్య ఫామ్, కొరటాల మేకింగ్ తోడైతే అది ఒక సరికొత్త రికార్డుకు నాంది పలుకుతుంది. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Apr 22 , 2026 | 02:29 PM