సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘దాదా’ వాయిదా వార్తలకు చెక్.. ఆ రోజు షెహరంతా అదిరిపోవాలి

ABN, Publish Date - Nov 29 , 2026 | 12:40 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఈ కాంబినేషన్ అనగానే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు గ్యారెంటీ. వీరి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న రెండో చిత్రం ‘దాదా’ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Dada Release Update

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni).. ఈ కాంబినేషన్ అనగానే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు గ్యారెంటీ. ‘వీరసింహా రెడ్డి’ వంటి హిట్ తర్వాత, వీరిద్దరి కలయికలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘దాదా’ (Dada Movie). ఈ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌లో థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ, గత కొద్ది రోజులుగా ‘దాదా’ సినిమా వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.


బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘దాదా’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే, డిసెంబర్‌లో రావాల్సిన ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదని, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుందంటూ ఫిల్మ్ నగర్‌లో గట్టిగా ప్రచారం జరిగింది. అంతే కాదు జనవరి 12న ‘దాదా’ థియేటర్లలోకి వస్తుందంటూ టాక్ వినిపించడంతో, డిసెంబర్‌లో సినిమా కోసం ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కానీ, ఈ రూమర్స్ అన్నింటికీ చిత్రబృందం తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. ‘దాదా’ సినిమా నుంచి బాలయ్య పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియోను మరోసారి షేర్ చేస్తూ.. ‘‘డిసెంబర్ 24నే సినిమా విడుదల. షెహరంతా అదిరిపోవాలి... బాక్సాఫీస్ బద్దలైపోవాలి..’’ అంటూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. దీంతో ‘దాదా’ వాయిదా పడుతుందన్న వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని తేలిపోయింది. అనుకున్న సమయానికే, అంటే డిసెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద బాలయ్య జాతర మొదలుకావడం ఖాయమైంది.

ఇక గాయం తర్వాత బాలకృష్ణ, ఏమాత్రం విరామం లేకుండా ‘దాదా’ షూటింగ్‌లో ఫుల్ స్వింగ్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు, ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న మంచు మనోజ్ డెడికేషన్‌కు సినీ వర్గాలు ఫిదా అవుతున్నాయి. ఇటీవల క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో మంచు మనోజ్‌కు గాయమైనట్లు ఇన్‌సైడ్ టాక్ వినిపించింది. సాధారణంగా అలాంటి గాయమైతే ఎవరైనా షూటింగ్‌కు బ్రేక్ ఇస్తారు. కానీ, తన వల్ల సినిమా షూటింగ్ ఆగకూడదని, అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవ్వాలని మనోజ్ గట్టిగా నిర్ణయించుకున్నారట. గాయానికి కేవలం ప్రాథమిక చికిత్స తీసుకుని, నొప్పిని సైతం లెక్కచేయకుండా వెంటనే షూటింగ్‌ను కంటిన్యూ చేశారట. బాలయ్య, మనోజ్ మధ్య వచ్చే ఈ క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.


రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నప్పటికీ, ప్రమోషన్స్ విషయంలో మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే నవంబర్ నెల ముగిస్తే, ‘దాదా’ చేతిలో ఉన్నది కేవలం 24 రోజులు మాత్రమే. అయినా ఇప్పటివరకు మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచలేదు. టీజర్, ట్రైలర్ ఎప్పుడు వస్తాయనే దానిపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే, అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 16వ తేదీన ‘దాదా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వెన్యూ ఇంకా ఫైనల్ కాలేదట. మరి మేకర్స్ ప్రమోషన్స్ జోరు ఎప్పుడు పెంచుతారు? చెప్పిన టైమ్‌కే ‘దాదా’ బాక్సాఫీస్ వద్ద ల్యాండ్ అవుతాడా? బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరోసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలంటే డిసెంబర్ 24 వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణీ.. పోరులో గెలిచేదెవరు?

దేశభక్తి నేపథ్యంలో ‘మిసెస్ కల్నల్’.. టీజర్ విడుదల

బాలయ్య-వివేక్ ఆత్రేయ ‘కురుక్షేత్రం’కు బ్రేక్?.. కారణం ఇదేనా

Updated Date - Nov 29 , 2026 | 12:40 AM