Dada: 'దాదా ఫస్ట్ సింగిల్ వచ్చేసి ఎప్పుడంటే
ABN , Publish Date - Nov 08 , 2026 | 02:24 PM
నందమూరి బాలకృష్ణ(NBK), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దాదా' చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ సాంగ్ కు ముహూర్తం కుదిరింది
నందమూరి బాలకృష్ణ(NBK), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'దాదా'(DADA). ‘వీరసింహారెడ్డి’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ కాంబో వస్తున్న రెండో సినిమా ఇది. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, నర్గీస్ ఫక్రీ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయాయ్రు. ‘దాదా ధమాకా’ (Dada Dhamaka) పేరుతో రూపొందిన ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 13న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ పాట మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ పాటతో మొదలుకానున్న ప్రమోషన్లు సినిమా విడుదల వరకు జోరుగా సాగనున్నాయని తెలుస్తోంది. సముద్రఖని, మంచు మనోజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 24, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.