Toxic: స్పెషల్ ప్రీమియర్ షో టిక్కెట్‌ ధర రూ. 600

ABN , Publish Date - Aug 25 , 2026 | 03:30 PM

యశ్ 'టాక్సిక్స్' మూవీ టిక్కెట్ రేట్లను ఏపీలోనూ పెంచుతూ జీవో విడుదలైంది. అక్కడ బుధవారం ఉదయం స్పెషల్ ప్రీమియర్‌ షో ధరను రూ. 600 గా ప్రభుత్వం నిర్ణయించింది.

Toxic movie

తెలంగాణ ప్రభుత్వం 'టాక్సిక్' టిక్కెట్ రేట్లను పెంచుతూ జీవో విడుదల చేసిన కొద్ది సేపటికే ఏపీ ప్రభుత్వం సైతం జీవోను రిలీజ్ చేసింది. ఇక్కడ మాదిరే ఏపీలోనూ 'టాక్సిక్' సినిమా టిక్కెట్ రేట్లను పదిరోజులకు పెంచుకునే సౌలభ్యాన్ని కల్పించారు. సింగిల్‌ స్క్రీన్స్ లో రూ. 50, మల్టిప్లెక్స్ థియేటర్లలో రూ. 100 పెంచుకోవచ్చు అని జీవోలో తెలిపారు. అలానే బుధవారం ఉదయం ఆరు గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోస్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షో టిక్కెట్ రేట్ ను రూ. 600కు ఖరారు చేసింది. ఈ పెరిగిన రేట్లన్నీ జి.ఎస్.టి. కలుపుకునే ఉంటాయి.


WhatsApp Image 2026-08-25 at 3.03.57 PM.jpeg

యశ్‌ నటించిన 'కేజీఎఫ్‌' ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత వస్తున్న 'టాక్సిక్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఓ రకంగా శుక్రవారం విడుదలై ఓ ప్రభంజనంలా సాగుతున్న రవితేజ 'ఇరుముడి' చిత్రానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఒకవేళ 'టాక్సిక్' సినిమా అన్ని వర్గాలను అలరించేలా ఉంటే... 'ఇరుముడి' కోలుకోవడం కష్టం. లేదంటే మాత్రం మొదటి ఆట పూర్తయిన తర్వాత తిరిగి ఎగ్జిబిటర్స్ 'ఇరుముడి' చిత్రాన్నే ప్రదర్శించే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే 'ఇరుముడి' వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను దాటేసింది. ఒకవేళ 'టాక్సిక్' ఫలితం అటూ ఇటూ అయితే... 'ఇరుముడి' తేలికగా రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్లను వసూలు చేసే ఆస్కారం ఉంటుంది. పైగా 'ఇరుముడి' ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేసి తీసిన సినిమా కాబట్టి, దానికి థియేటర్లు దొరికితే మాత్రం ఖచ్చితంగా మరింత ప్రభావంతమైన వసూళ్ళను ఆ సినిమా రాబట్టే ఆస్కారం ఉంది.

ఇవి కూడా చదవండి:

Arjun Das: దర్శకుడు ఏ మాత్రం తగ్గలేదు..

ఇరుముడి మణమ్మ జీవితంలో ఇంత విషాదమా.. కన్నీళ్లు వచ్చేస్తాయి

రష్మిక తల్లి కాబోతుందా...

Updated Date - Aug 25 , 2026 | 03:32 PM