Arjun Das: దర్శకుడు ఏ మాత్రం తగ్గలేదు..

ABN , Publish Date - Aug 25 , 2026 | 07:49 AM

తాను కథానాయకుడుగా నటించిన ‘వన్స్‌మోర్‌’ (once More) చిత్ర కథను దర్శకుడు పలువురు నిర్మాతలకు వివరించగా హీరోను మార్చాలని కోరారని, కానీ, దర్శకుడు మాత్రం అంగీకరించకుండా తనతోనే సినిమా తీశారని అర్జున్‌ దాస్‌ అన్నారు.

తాను కథానాయకుడుగా నటించిన ‘వన్స్‌మోర్‌’ (once More) చిత్ర కథను దర్శకుడు పలువురు నిర్మాతలకు వివరించగా హీరోను మార్చాలని కోరారని, కానీ, దర్శకుడు మాత్రం అంగీకరించకుండా తనతోనే సినిమా తీశారని అర్జున్‌ దాస్‌ అన్నారు. ‘గుడ్‌నైట్‌’, ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ వంటి చిత్రాల నిర్మాత యువరాజ్‌ నిర్మించిన ‘వన్స్‌మోర్‌’ చిత్రంలో అదితి శంకర్‌, సోనా హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 28న విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అర్జున్‌ దాస్‌ మాట్లాడుతూ

‘నేను ఇప్పటివరకు నటించిన చిత్రాలతో పోలిస్తే ఎలాంటి రక్తపాతం, హింస లేకుండా తీసిన ఒక మంచి ప్రేమకథా చిత్రం. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలాంటి కథలనే కోరుకుంటున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. దీనికి కారణం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సోనా, అదితి శంకర్‌. ఈ స్టోరీని దర్శకుడు అనేక మంది నిర్మాతలకు వివరించారు. వారంతా హీరోను మార్చాలని కోరారు. కానీ, దర్శకుడు మాత్రం హీరో అర్జున్‌ దాస్‌ అని, అతన్ని మార్చే ప్రసక్తే లేదని వారికి తేల్చి చెప్పారు. చివరకు నిర్మాత యువరాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి:

‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ హీరో అవుతున్నాడు.. సినిమా టైటిల్ ఇదే

సాయి మాచిరాజుతో హీరో ప్రిన్స్ వివాహం.. ఫొటోలు వైరల్

‘మహాకాళి’ గ్లింప్స్ రివ్యూ: శుక్రాచార్యుడి యుద్ధ శంఖారావం.. గూస్‌బంప్స్ పక్కా

Updated Date - Aug 25 , 2026 | 08:17 AM