ఇరుముడి మణమ్మ జీవితంలో ఇంత విషాదమా.. కన్నీళ్లు వచ్చేస్తాయి
ABN , Publish Date - Aug 24 , 2026 | 09:19 PM
ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే ఒక్క సినిమా చాలు. అది ఎవరికైనా సరే. బేబీ నక్షత్ర.. అంటే ఎవరూ గుర్తుపట్టరేమో.. అదే ఇరుముడి సినిమాలో త్రినాథ్ కూతురు మణమ్మ అని చెప్పండి. అలాంటి కూతురే మాకు ఉండాలని చెప్తారు.
ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే ఒక్క సినిమా చాలు. అది ఎవరికైనా సరే. బేబీ నక్షత్ర.. అంటే ఎవరూ గుర్తుపట్టరేమో.. అదే ఇరుముడి సినిమాలో త్రినాథ్ కూతురు మణమ్మ అని చెప్పండి. అలాంటి కూతురే మాకు ఉండాలని చెప్తారు. ఇరుముడి సినిమాకు మణికంఠనే ప్రాణం అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. రవితేజ, ప్రియ భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యప్ప సాంగ్స్ కి థియేటర్లన్నీ గుడులుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా మణమ్మ నటనకు నీరాజనాలు పడుతున్నారు. తండ్రీకూతుళ్లుగా రవితేజ - నక్షత్ర నటించలేదు.. జీవించారు అంటూ ప్రశంసిస్తున్నారు. తాజాగా ఇరుముడి సక్సెస్ మీట్ లో బేబీ నక్షత్ర గురించిన ఒక పర్సనల్ విషయాన్ని దర్శకుడు శివ నిర్వాణ రివీల్ చేశాడు.
ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది స్టార్స్ వెనుక చాలా పెయిన్ ఫుల్ గతం ఉంటుంది. ఈ చిన్నారికి కూడా అలాంటి ఒక బాధ ఉంది. అదేంటంటే.. బేబీ నక్షత్ర తండ్రి చిన్నతనంలోనే మరణించారు. కన్నతల్లి ఒక్కత్తే కష్టపడి కూతురును పెంచిందని, ఇలాంటి తల్లిని, నక్షత్ర లాంటి కూతురును ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని శివ నిర్వాణ చెప్పుకొచ్చాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే నక్షత్ర వెనుక ఇలాంటి ఒక స్టోరీ ఉందని తెలియని ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నక్షత్రను శివ నిర్వాణ ఎలా సెలెక్ట్ చేశాడో కూడా వివరించాడు.
'నేను ఈ సినిమా కథ రాసుకుంటున్నప్పుడు, రవితేజ గారి పక్కన ఆయన కూతురిగా నటించే అమ్మాయి అచ్చం ఆయన లాగే కనిపించాలి అనుకున్నాను. ఆ ఫేషియల్ ఫీచర్స్, ఆ కళ్లు, ఆ ఎనర్జీ పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వాలని వెతుకుతున్న సమయంలో.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో నక్షత్ర చేసిన ఒక రీల్ చూశాను. చూడగానే ఈ పాప అచ్చం రవితేజ గారి కూతురులాగే ఉంది, మన క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అనిపించి వెంటనే సెలెక్ట్ చేశాను. సినిమాలో ఆడపిల్లని ధైర్యంగా పెంచాలి.. పెరగలి అని చెప్తున్నాం. ఈ పిల్ల అంత డేరింగ్.. గట్టి గుండెను నేను ఎక్కడా చూడలేదు. ఆ తర్వాత షూటింగ్ టైమ్‌లో నాకు తెలిసిన నిజం ఏంటంటే.. ఈ పాపకి నిజ జీవితంలో తండ్రి లేరు. చిన్నతనంలోనే వాళ్ల ఫాదర్ చనిపోయారు. వాళ్ల అమ్మగారే ఎంతో కష్టపడి నక్షత్రని బాధ్యతగా పెంచుకుంటూ వస్తున్నారు.
అయితే సెట్స్‌లో రవితేజతో యాక్ట్ చేసేటప్పుడు మాత్రం, ఆ పాపకి ఆయన రూపంలో ఒక తండ్రి ప్రేమ, కేరింగ్ లభించాయి. రవితేజ కూడా ఆ పాపని అచ్చం తన సొంత కూతురిలాగే చూసుకుని ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. అందుకే స్క్రీన్ మీద వారిద్దరి మధ్య ఉన్న ఆ ఫాదర్-డాటర్ బాండింగ్ అంత నాచురల్‌గా, ఎమోషనల్‌గా కుదిరింది' అని శివ నిర్వాణ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బేబీ నక్షత్ర నాలుగు పెద్ద సినిమాల్లో చేస్తోంది. ఇలానే ఆమె మంచి సినిమాలు చేస్తూ హీరోయిన్ గా మారాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.