సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kaaka: మెగాస్టార్ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్..

ABN, Publish Date - Oct 25 , 2026 | 01:04 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’.  ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’(Kaaka).  ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనురాగ్ కాశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరో సీనియర్ నటుడు ఈ సినిమాలో భాగం కానున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. విలక్షణ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించనున్నారని టాక్ నడుస్తోంది. ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని,   అయితే  కథకు ఆ పాత్ర కీలకమని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

ఇప్పటికే ‘కాకా’ షూటింగ్ దాదాపు 85 శాతం పూర్తయినట్లు  చిత్ర బృందం చెబుతోంది. డిసెంబర్ మొదటి వారంలోగా చిత్రీకరణను పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ALSO READ:
Jailer 2: 40 ఏళ్ల తర్వాత.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన రజనీ

యోగిబాబు ‘సింగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 30న థియేటర్లలోకి!

Sai Durga Tej: సాయితేజ్‌ సినిమాలో కాంతార భామ

Updated Date - Oct 25 , 2026 | 01:14 PM