Baa Baa Black Sheep: అనిల్ రావిపూడి చేతుల మీదుగా...
ABN, Publish Date - Sep 16 , 2026 | 11:24 AM
న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ మూవీ 'బా బా బ్లాక్ షీప్' అక్టోబర్ 9న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను అనిల్ రావిపూడి విడుదల చేశారు.
న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. టీను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరణను జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, రీసెంట్‌గా రిలీజైన ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘వేవేలా ఊహలే చూపినా..’ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాటను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
ఈ పాట విషయానికి వస్తే... తమకు కావాల్సిన ఓ అరుదైన బాక్స్ కోసం విలన్ గ్యాంగ్ వెతుకుతుంటుంది. అది హీరో, హీరోయిన్ దగ్గర ఉందని వారు భావిస్తుంటారు. అదే సమయంలో వాళ్లు విలన్స్ కంటపడతారు. మరోవైపు హీరో చేతిలో గన్ ఉంటుంది. అది ఊహించని రీతిలో పేలుతుంది. దీంతో హీరోహీరోయిన్‌లపై గ్యాంగ్ రివర్స్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో రెట్రో స్టైల్లో ‘వేవేలా ఊహలే చూపినా..’ సాంగ్ ప్లే అవుతుంటుంది. దీనిని కిట్టు విస్సాప్రగడ రాయగా శ్రీసాగర్ పాడారు.
ఈ మూవీ గురించి నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ, 'డిఫరెంట్ స్టైల్లో సాగే పాట ఇది. ఈ సాంగ్‌ను రిలీజ్ చేసిన మా అనిల్ రావిపూడి గారికి థాంక్స్. సినిమాను అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. మేఘాలయలోనే పూర్తి సినిమాను కంప్లీట్ చేశాం. ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లోనూ చిత్రీకరించాం. పక్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్టర్ గుణి, నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ఎంటైర్ టీమ్ సహకారంతో ఇది సాధ్యమైంది' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
కత్రీనా పని అయిపోయింది.. పూర్తిగా ఆంటీలా మారిపోయింది
అబ్బా.. భాగ్యశ్రీ అందం.. రామ్ అన్నా ఎక్కడో మచ్చేసుకోని పుట్టాడురా
కావ్య - కాలభైరవ పెళ్లి డేట్ ఫిక్స్..