సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anaswara Rajan: కథల ఎంపికలో నా ఫస్ట్ ప్రయారిటీ అదే..

ABN, Publish Date - Nov 07 , 2026 | 05:33 PM

తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే చిరంజీవి గారి సినిమాలో అవకాశం రావడం చాలా  అదృష్టంగా భావిస్తున్నా.

''తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే చిరంజీవి గారి సినిమాలో అవకాశం రావడం చాలా  అదృష్టంగా భావిస్తున్నా. 'కాకాలో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది. ఆయన  వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎన్నో విషయాలు ఆయన్నుంచి నేర్చుకోవచ్చు'' అని అనశ్వర రాజన్ అన్నారు.

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల దర్శకుడు. వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అనస్వర రాజన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 


''తెలుగులో నేను సైన్ చేసిన మొదటి సినిమా ఇది. ‘ఛాంపియన్’ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. 'ఇట్లు అర్జున'లో చేసిన కీర్తి క్యారెక్టర్ చాలా యూత్‌ఫుల్ అండ్ ఇన్నోసెంట్‌గా ఉంటుంది. ప్రతి అమ్మాయి కీర్తి క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతారు. కథ విన్నప్పుడు కూడా కీర్తి క్యారెక్టర్‌తో చాలా కనెక్ట్ అయ్యాను. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఇందులో హీరోకి మాటలు ఉండవు. ఈ కథలో ఆకర్షించిన విషయాల్లో అది ఒకటి. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమా కోసం నేను, అనీష్ కలిసి వర్క్ షాప్స్ చేశాం. సీన్స్ చాలా ప్రాక్టీస్ చేశాం. మా ఇద్దరి క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమాలో మెయిన్ కోర్ ప్రేమకథ. అయితే హీరోకి మాటలు రావు కాదు కాబట్టి తను ప్రేమను ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇందులో యాక్షన్, లవ్ స్టోరీ, సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాని అందరూ ఇష్టపడతారని నమ్ముతున్నాను. దీపావళిని ఇట్లు అర్జున్ సక్సెస్ తో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మా ఇద్దరి పాత్రలను జనాలు బాగా గుర్తు పెట్టుకుంటారు" 


మంచి కథలకే నా తొలి ప్రాధాన్యత!

"ఈ సినిమా చేయడానికి మరో కారణం డైరెక్టర్ మహేష్. ఆయన విజన్ నాకు చాలా నచ్చింది. ఇందులో ప్రతి పాత్రను అద్భుతంగా రాసుకున్నారు. అది నాకు చాలా నచ్చింది. కీర్తి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది. ఆయన ఏం చెప్తే అది ఫాలో అయిపోయాను. చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశాం. అనీష్ తో కూడా వర్క్ ఎక్సపీరియెన్స్ బాగుంది. మూగవాడి పాత్ర చేయడం అంత ఈజీ కాదు. చాలా బాగా చేసాడు. యాక్షన్, డ్యాన్స్ కూడా అద్భుతంగా చేశాడు.  కచ్చితంగా ఆడియన్స్ తనని ఇష్టపడతారు. 
నాగార్జున గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.  తెలుగులో వరుసగా పెద్ద అవకాశాలు రావడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారి ‘కాకా’, ‘తులాభారం’, సంగీత్ శోభన్ తో ‘అంతా రాములోరు చూస్కుంటారు’ సినిమా చేస్తున్న. ఇవన్నీ భిన్నమైన  కథలు, పాత్రలు. ఇలాంటి మంచి సినిమాల్లో భాగం కావడం ఆనందంగా ఉంది. నా దృష్టి అంత మంచి కథలపైనే ఉంటుంది. కథల ఎంపికలో నా ఫస్ట్ ప్రయారిటీ అదే."

ALSO READ:

వెంకీ విక్టరీకి అనిల్ రావిపూడినే దిక్కా..?

ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే

నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్

Updated Date - Nov 07 , 2026 | 07:01 PM