యాక్టింగ్‌లోకి దిగిన దర్శకుడు.. ‘అనకాపల్లి’ ట్రైలర్ ఎలా ఉందంటే
ABN, Publish Date - Jul 27 , 2026 | 05:52 PM
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో.. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు.
విక్రమ్ సహిదేవ్ (Vikram Sahidev), సంధ్యా వశిష్ట (Sandhya Vasishta), తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) ప్రధాన పాత్రల్లో.. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన (Thrinadha Rao Nakkina) ఓ ముఖ్య పాత్రను కూడా పోషించడం విశేషం. ఇప్పటి వరకు తెర వెనుక ఉన్న నక్కిన.. ఈసారి తనలోని యాక్టింగ్ టాలెంట్‌ని తెలియజేసేందుకు తెరపై కనిపించబోతున్నారు. ఆగస్ట్ 7న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ ట్రైలర్ వదిలి, సినిమాపై మరింతగా క్రేజ్ ఏర్పడేలా చేశారు.
ఈ ట్రైలర్ విడుదల విషయానికి వస్తే.. విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ థండర్స్ టీం కలిసి వేలాది మంది సమక్షంలో విడుదల చేశారు. హీరో శ్రీకాంత్, థమన్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు తదితరులంతా కూడా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కొత్తగా ఉండటంతో పాటు.. ‘పుష్ప 2’ ఫేమ్ తారక్ పొన్నప్ప విలనిజం డిఫరెంట్‌గా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా ఉండటంతో సినిమాపై సరికొత్త ఫీల్ ఏర్పడుతోంది. ఈ ట్రైలర్‌లో మిడిల్ క్లాస్ పేరెంట్స్‌గా త్రినాథరావు నక్కిన, ఇంద్రజ జంట కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సినంత ఎమోషన్ ఉందనిపిస్తోంది. యూత్, మాస్ ఆడియెన్స్‌కి నచ్చే లవ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. హీరో విక్రమ్ సహిదేవ్‌కు ఇదొక మంచి ప్రాజెక్ట్ అవుతుందనే ఫీల్‌ని ట్రైలర్ ఇస్తుండగా, హీరోయిన్ సంధ్య తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కినట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా అయితే.. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలా ఈ సినిమా ఉంటుందని.. ఈ ట్రైలర్ తెలియజేస్తోంది.
ఇవి కూడా చదవండి:
అనిల్ రావిపూడి కోసం నిర్మాతలు క్యూ.. ‘పెద్ది’ సారూ?
మరీ ఈ రేంజ్‌లోనా.. ఆదర్శకుటుంబం వెంకీ పాత్ర రివీల్
‘టాక్సిక్’ వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్.. అరాచకం