రామ్ చరణ్‌కు కాదు.. కెవిన్ కుంటా ఇప్పుడెవరి బాడీగార్డో తెలుసా
ABN , Publish Date - Aug 16 , 2026 | 03:15 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్‌గా పనిచేసి దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కెవిన్ కుంటా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పర్సనల్ బాడీగార్డ్‌గా పనిచేసి దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కెవిన్ కుంటా (Kevin Kunta) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్లలో ఆయన వెంటే ఉంటూ, తన భారీ కటౌట్, స్టైలిష్ లుక్స్‌తో కెవిన్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. అయితే తాజాగా సినీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం, కెవిన్ కుంటా ఇకపై రామ్ చరణ్ వ్యక్తిగత భద్రతా బృందంలో పనిచేయడం లేదని, ఆయన కింగ్ అక్కినేని నాగార్జున వద్ద బాడీగార్డ్‌గా చేరినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
గాంబియా దేశానికి చెందిన ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ (MMA) ఫైటర్ అయిన కెవిన్ కుంటా, గత నాలుగేళ్లుగా రామ్ చరణ్ కుటుంబానికి నమ్మకమైన సెక్యూరిటీగా సేవలందించారు. చరణ్ ఎక్కడికి వెళ్లినా అన్నీ తానై చూసుకునే కెవిన్, ఫ్యాన్స్ దూసుకొచ్చినప్పుడు వాళ్లను ఒంటిచేత్తో ఎత్తి పక్కకు నెట్టేసే వీడియోలు గతంలో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ సైతం పలు ఇంటర్వ్యూలలో తన బాడీగార్డ్ పాపులారిటీపై సరదా కామెంట్లు చేస్తూ అతడిని ప్రశంసించారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న కెవిన్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ టీమ్ నుంచి తప్పుకుని అక్కినేని కాంపౌండ్‌లోకి అడుగుపెట్టడం సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) తన భద్రతా బాధ్యతలను కెవిన్ కుంటాకు అప్పగించారని సమాచారం. భారీ పర్సనాలిటీ, అంతర్జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం కలిగిన కెవిన్ రాకతో నాగార్జున పబ్లిక్ అప్పియరెన్సెస్‌లో సెక్యూరిటీ మరింత పటిష్టం కానుందని భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోల బాడీగార్డ్స్‌ను తలపించే రేంజ్‌లో రోజుకు లక్షల్లో పారితోషికం తీసుకునే కెవిన్ కుంటా, రామ్ చరణ్ నుంచి నాగార్జున వద్దకు షిఫ్ట్ అవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి ట్రెండ్ అవుతోంది. ఈ వార్తలకు కారణం రీసెంట్‌గా నాగార్జున హాజరైన ఓ వేడుకలో కెవిన్ కుంటా సందడి చేయడమే. నాగార్జునకు సెక్యూరిటీగా కనిపించడంతో.. కెవిన్ కుంటా పార్టీ మారారంటూ నెటిజన్లు కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘ధర్మస్థల నియోజకవర్గం’కు క్రిష్, చంద్రబోస్ సపోర్ట్.. ఏం చేశారంటే
హోటల్ రూమ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్‌కు చేదు అనుభవం
చిరంజీవితో వెంకీ అట్లూరి సినిమా.. ఎందుకు ఆగిందంటే