అడివి శేష్ వదిలిన ‘అ’ ఫస్ట్ లుక్.. టైటిల్ జస్టిఫికేషన్ ఇదే
ABN , Publish Date - Aug 16 , 2026 | 04:52 PM
ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సంస్థలు నిర్మిస్తోన్న మూవీ ఫస్ట్ లుక్‌ని అడివి శేష్ వదిలారు.
ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. రాహుల్ విజయ్ (Rahul Vijay), అర్చన అయ్యర్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి ‘అ’ (AH Movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్, ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ BH నిర్మిస్తుండగా.. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌ను హీరో అడివి శేష్ (Adivi Sesh) ఆవిష్కరించారు. ఈ టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇస్తూ.. చుట్టూ ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలను పొందుపరిచారు. అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత జరిగే దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుందని ఈ పదాలు సూచిస్తున్నాయి. ఇక ‘అనుమానం, అసాంఘికం, అమానుషం’ వంటి పదాలు కథలో కనిపించేదానికంటే మరింత ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయనే క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఆలోచింపజేసే పదాలతో రూపొందించిన ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ డిజైన్.. విడుదలకు ముందే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మరోవైపు మేకర్స్ వదిలిన హీరో రాహుల్ విజయ్ ఫస్ట్ లుక్ కూడా భారీ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్‌లో ఓ ప్రదేశంలో చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని రాహుల్ విజయ్ కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నేలంతా రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఈ ఇంటెన్స్ విజువల్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ థ్రిల్లర్ కథ హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుందని అర్థమవుతోంది. ఇంట్రెస్టింగ్ టైటిల్, క్యూరియాసిటీని పెంచే టైటిల్ డిజైన్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో పాటు సాధారణ మిస్సింగ్ గర్ల్స్ థ్రిల్లర్‌కు భిన్నంగా, వైవిధ్యమైన కథ, కథనాలతో ‘అ’ రాబోతుందనే విషయాన్ని మేకర్స్ ప్రతి విషయంలో అర్థమయ్యేలా చూపించడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకుంటున్నాయి. ీ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రామ్ చరణ్‌కు కాదు.. కెవిన్ కుంటా ఇప్పుడెవరి బాడీగార్డో తెలుసా
‘ధర్మస్థల నియోజకవర్గం’కు క్రిష్, చంద్రబోస్ సపోర్ట్.. ఏం చేశారంటే
హోటల్ రూమ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్‌కు చేదు అనుభవం