సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘అంబ’స్ రివెంజ్’.. ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసా

ABN, Publish Date - Jul 01 , 2026 | 05:06 PM

మహాభారతం నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తున్నాయి. మహాభారతంలోని పాత్రలతో, ఆ పాత్రలను పోలిన కథలతో వచ్చిన సినిమాలకు జనాలు నీరాజనాలు పడుతున్నారు.

Amba's Revenge Update

మహాభారతం నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తున్నాయి. మహాభారతంలోని పాత్రలతో, ఆ పాత్రలను పోలిన కథలతో వచ్చిన సినిమాలకు జనాలు నీరాజనాలు పడుతున్నారు. ఇప్పుడలాంటి నేపథ్యంలోనే కాదు కాదు.. ‘మహాభారతం’లోని ఓ పాత్రకు సంబంధించిన రివెంజ్ కథతో ఓ సినిమా ముస్తాబవుతోంది. అదే.. ‘అంబ’స్ రివెంజ్’ (Amba’s Revenge). నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జయవర్ధన్ మడి (Jayavardhan Madi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఉన్న స్పెషల్ ఏంటంటే.. పూర్తి స్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రానికి ఏఐ విజువల్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌ను ‘కాలై విజువల్ స్టూడియోస్’ అందిస్తోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


భారత ఇతిహాసమైన మహాభారతం (Mahabharata)లోని శక్తివంతమైన పాత్ర ‘అంబ’ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోంది. తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఇది మరొక ‘మహావతార్ నరసింహ’ రేంజ్ చిత్రం అవుతుందనే ఫీల్‌ని ఇస్తూ.. పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్ విడుదల సందర్భంగా..


నిర్మాత యోగేంద్ర పొట్లూరి, దర్శకుడు జయవర్ధన్ మడి మాట్లాడుతూ.. తెలుగు సినిమాకు ఇదొక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది అని తెలిపారు. చిత్ర నిర్మాణంలోని పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని, ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించి, వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. ఇదొక విజువల్ వండర్‌లా ప్రేక్షకులను కట్టిపడేస్తుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు. టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని, సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని వారు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

‘కాగితం పడవలు’ చిత్రబృందం చేసిన పనికి చిరు ఫిదా.. ఏం చేశారంటే

Spider - Man : షాకింగ్ రెమ్యూనరేషన్... మెస్సీ నా మజాకా!?

సమంత దూకుడు.. అనుష్కను మించి రికార్డుల వేట

Updated Date - Jul 01 , 2026 | 05:06 PM