Raaka: ‘రాకా’ ఇంటర్వెల్లో బన్నీ విధ్వంసం!
ABN, Publish Date - Nov 01 , 2026 | 10:30 AM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల విషయంలో దర్శకుడు అట్లీ ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. నవంబర్ రెండో వారంలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్‌పై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. సినిమా మొత్తంలోనే ఈ ఇంటర్వెల్ బ్లాక్ హైలైట్‌గా నిలిచేలా అట్లీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాఫియా నేపథ్యంలో ఓ డాన్ చుట్టూ ఈ కథ సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అల్లు అర్జున్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు అట్లీ మాస్ టేకింగ్ తోడైతే వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ:
Anchor Suma: నా వృత్తిజీవితాన్ని గెలిపిస్తూ వచ్చింది అదే.. నా నిర్ణయం సరైనదే!
RC17: అఫీషీయల్.. ఆర్సీ17 పూజ అప్పుడే
Sai Palalvi: మనకేం రాసుందో అదే జరుగుతుంది.. దానికోసం యుద్దాలు అక్కర్లేదు