Happy: రీ రిలీజ్‌లోనూ.. ‘హ్యాపీ’ సంచలనం

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:05 PM

అల్లు అర్జున్(Allu Arjun) కు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్‌ ఉందో.. మాలీవుడ్‌లోనూ అంతే క్రేజ్‌ ఉంది. అక్కడ ఆయనకు అభిమానుల సంఖ్య ఎక్కువ.

అల్లు అర్జున్(Allu Arjun) కు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్‌ ఉందో.. మాలీవుడ్‌లోనూ అంతే క్రేజ్‌ ఉంది. అక్కడ ఆయనకు అభిమానుల సంఖ్య ఎక్కువ. అందుకే బన్నీని మల్లూ అర్జున్‌ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన నటించిన ప్రతి చిత్రం మలయాళ భాషలో తప్పనిసరిగా విడుదలవుతుంది. కరుణాకరణ్‌ దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘హ్యాపీ’ (Happy) చిత్రం మలయాళంలో ఇటీవల రీ - రిలీజ్‌ అయింది.

అక్కడ ‘హ్యాపీ బీ హ్యాపీ’ టైటిల్‌తో ఇటీవల ప్రేక్షకులు ముందుకొచ్చింది. 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మలయాళ అభిమానులు. థియేటర్లు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. స్ర్కీన్‌ ముందు డాన్స్‌లు, హంగామా చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్‌ సరసన జెనీలియా నటించిన ఈ చిత్రానికి ఎ కరుణాకరణ్‌ దర్శకుడు. అల్లు అరవింద్‌ నిర్మించారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందించారు.

Updated Date - Jun 14 , 2026 | 04:27 PM