సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హాజరు కావాల్సిందే.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

ABN, Publish Date - Jun 19 , 2026 | 01:32 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు తెలిపింది.

Icon Star Allu Arjun

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన (Sandhya Theater Stampede)లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun)కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు A11 నిందితుడిగా చేర్చారు. A1 నుంచి A10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు మరో 23 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు చార్జ్‌షీట్‌ వేసిన విషయం తెలిసిందే. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాత కేసులో నాంపల్లి కోర్టు ట్రయల్ ప్రారంభించనుంది. మరి సోమవారం అల్లు అర్జున్ హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.


అసలేం జరిగిందంటే.. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీతేజ్ క్రమక్రమంగా కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల అల్లు అరవింద్‌, అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి శ్రీతేజ్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.


అల్లు అర్జున్‌కు ఊరట

ఈ సంధ్య థియేటర్‌ కేసుకు సంబంధించి హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వెకేషన్ సివిల్ జడ్జి- అదనపు చీఫ్ జడ్జి జూన్ 4వ తేదీన అల్లు అర్జున్‌ ఊరట నిచ్చేలా కొన్ని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఈ కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో, వాస్తవ నిర్ధారణకు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు, ఆధార రహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, వార్తా కథనాలు, సోషల్‌ మీడియా పోస్టులు చేయరాదని కోర్టు ఆదేశించింది. దీనితో అల్లు అర్జున్‌కి సంధ్య థియేటర్‌ కేస్‌ విషయంలో కాస్త ఊరట లభించినట్లైంది.

ఇవి కూడా చదవండి:

నా భర్త నుంచి ప్రాణహాని: నటుడి మొదటి భార్య

NBK111: కళ్లజోడు పెట్టిన కాజల్.. బాలయ్య మూవీలో లుక్ వచ్చేసింది

‘మకుటం’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. అందుకే ఆలస్యమైంది!

Updated Date - Jun 19 , 2026 | 01:33 PM