‘రాకా’ విషయంలో బన్నీ ఫ్యాన్స్ ఆందోళన.. కారణమిదేనా?
ABN, Publish Date - Nov 21 , 2026 | 02:18 PM
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాల్లో ‘రాకా’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాల్లో ‘రాకా’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కలయికలో రూపొందుతోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ సంస్థపై కళానిధి మారన్ దాదాపు రూ.800 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా.. రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతటి భారీ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సాధారణంగా పెద్ద సినిమా అనగానే పాటలు, నేపథ్య సంగీతంపై కూడా అంతే స్థాయిలో ఆశలు ఉంటాయి. అయితే, ఇప్పుడు సాయి అభ్యంకర్ పేరు సోషల్ మీడియలో బాగా వినిపిస్తోంది. కానీ, ఈసారి వైరల్ అవ్వడానికి కారణం పాజిటివ్ బజ్ కాదు.. ఒక సినిమా రిలీజ్ తర్వాత మొదలైన చర్చ.
తమిళ స్టార్ హీరో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం’ (OM Movie). ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే, ఈ సినిమాకు సాయి అభ్యంకర్ (Sai Abhyankkar) ఇచ్చిన సంగీతంపై సోషల్ మీడియలో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని సన్నివేశాలకు మ్యూజిక్ సరిగ్గా సింక్ కాలేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కొన్ని సీన్లలో అనవసరంగా లౌడ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాడారని, కథా గమనానికి విరుద్ధంగా సౌండ్స్ వచ్చాయని అభిప్రాయపడుతున్నారు.
నిజం చెప్పాలంటే, కెరీర్ పరంగా సాయి అభ్యంకర్ ఇంకా చాలా చిన్నవాడు. అతని ప్రతిభ గురించి ఎవరికీ సందేహం లేదు కానీ, ఒక భారీ యాక్షన్ సినిమాకు కథను మరింత బాగా చూపించేలా చక్కని సంగీతం ఇవ్వగలడా లేదా అనే సందేహాలు మొదటి నుంచీ కొందరిలో ఉండేవి. ఇప్పుడు ‘ఓం’ సినిమా విషయంలో ఈ యువ సంగీత దర్శకుడు కొంచెం తడబడ్డాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా విషయంలో బన్నీ అభిమానుల్లో ఒక చిన్న భయాన్ని కలిగిస్తోంది. రాకాకు ఎలాంటి సంగీతం ఇస్తాడు? అనే ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. సాయి ప్రతిభ, సామర్థ్యంపై ఎలాంటి అనుమానం లేకపోయినా, ఇంత పెద్ద సినిమాకు పనిచేసేటప్పుడు తన పనితీరును ఇంకొంచెం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.
సాయితో మంచి ఫలితం రాబట్టాల్సిన బాధ్యత దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్లపై ఉందని అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అలాగే, వస్తున్న అభిప్రాయాలను సాయి అభ్యంకర్ కూడా బాగా అర్థం చేసుకుని తప్పులు సరిదిద్దుకోవాలని కోరుతున్నారు. మొత్తానికి ‘ఓం’ చుట్టూ జరుగుతోన్న ఈ చర్చ ‘రాకా’ మ్యూజిక్ మీద కూడా దృష్టి పెట్టేలా చేసింది. మరి ‘రాకా’కు సాయి అభ్యంకర్ ఎలాంటి మ్యూజిక్ అందించి, వస్తున్న విమర్శలకు ఎలా సమాధానం చెబుతాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
గిల్ కాదు.. సారా టెండూల్కర్ పెళ్లాడేది ఆ హీరోనా?
డౌట్స్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ఎవరితో..
బాలీవుడ్‌కు ‘గరుడవేగ’ అంజి.. ‘అన్ఎక్స్పెక్టెడ్’