సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరో అడుగు

ABN, Publish Date - Oct 05 , 2026 | 07:37 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వివిధ రాష్ట్రాల్లో అభిమానుల సంఘాలు కూడా మరింత గా పెరుగుతున్నాయి.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  పాన్ ఇండియా స్టార్‌గా బన్నీకి క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అభిమానుల సంఘాలు కూడా మరింత గా పెరుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మహారాష్ట్రలో ఓ అడుగు ముందుకేసింది. ముంబై వేదికగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో AAFA మహారాష్ట్ర రాష్ట్ర కమిటీతో పాటు 10 జిల్లాల కమిటీలను అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంతో మహారాష్ట్రలో అల్లు అర్జున్ అభిమానుల సంఘానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు అభిమానులు భావిస్తున్నారు. 

ఇప్పటివరకు వ్యక్తిగతంగా, స్థానిక స్థాయిలో బన్నీ అభిమానుల కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల కార్యకలాపాలను మరింత వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు ఈ కమిటీల ఏర్పాటు ఉపయోగపడనుందని సంఘంలోని కీలక సభ్యులు వెల్లడించారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. మహారాష్ట్రలో AAFA విస్తరణతో బన్నీ ఫాన్స్ అసోసియేషన్కి  మరింత బలమైన వ్యవస్థ ఏర్పడినట్లైంది.  


ఇవి కూడా చదవండి:

అలాంటి కొటేషన్స్ వేసి.. ఇలా తగ్గావ్ ఏంటి బండ్లన్నా?

నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది

నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్

Updated Date - Oct 05 , 2026 | 07:58 PM